2021, 2022 టీ20 ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను పరస్పరం మార్చుకునే విషయంపై బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఐసీసీ బోర్డు వర్చువల్ సమావేశం సందర్భంగా ఈ రెండు బోర్డు సభ్యులు దీనిపై చర్చించనున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆస్ట్రేలియాలో, వచ్చే ఏడాది భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహించాలి. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన మెగా టోర్నీ 2022కు వాయిదా పడింది. ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ).. వచ్చే ఏడాదే ఆ టోర్నీని నిర్వహించాలని భావిస్తోంది. 2023లో వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న బీసీసీఐ.. 2022లో పొట్టి కప్పు నిర్వహణకు సిద్ధంగా లేదు. మరి రెండు బోర్డులు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.