ETV Bharat / sports

ఖాళీ స్టేడియాల్లో క్రీడల నిర్వహణ సాధ్యమా?

ఖాళీ స్టేడియాల్లో క్రీడల నిర్వహణ సరికాదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సహా భారత ప్రముఖ ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. దిగ్గజ​ ఫుట్​బాలర్​ బైచుంగ్​ భాటియా మాత్రం.. అభిమానులు లేకుండా ఫుట్​బాల్ మ్యాచ్​లు నిర్వహించాలని కోరాడు.

cricket ground
ఖాళీ స్టేడియాల్లో క్రీడల నిర్వహణ సాధ్యమా?
author img

By

Published : Apr 22, 2020, 3:09 PM IST

Updated : Apr 22, 2020, 3:19 PM IST

కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో క్రీడారంగం స్తంభించిపోయింది. అన్ని పోటీలు వాయిదా లేదా రద్దయ్యాయి. అయితే జర్మనీ ఫుట్​బాల్ లీగ్ బండ్సెలిగా మాత్రం వచ్చే నెల నుంచి ప్రేక్షకుల లేకుండానే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఖాళీ మైదానాల్లో క్రీడల నిర్వహించడం అనే అంశంపై పలువురు భారత ఆటగాళ్లు, మాజీలు.. తమ అభిప్రాయాలు వెల్లడించారు.

"జర్మనీ, భారత్​లకు చాలా తేడా ఉంది. మనదగ్గర ఖాళీ స్టేడియాల్లో టోర్నీలు నిర్వహించడం అనేది కష్టం. పరిస్థితులు చక్కబడే వరకు క్రికెట్​ మ్యాచ్​లు జరగకపోవచ్చు. మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టి, పోటీలు నిర్వహించరని నా అభిప్రాయం"

-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

"ఐపీఎల్​లో ఆడే ప్రముఖ క్రికెటర్లు.. విమానాశ్రయాలకు వెళ్లి వచ్చేటప్పుడు, హోటళ్లులో ఉండేటప్పుడు, స్టేడియంలో ఉన్నప్పుడు బయట అభిమానులు ఎక్కువ సంఖ్యలో చేరతారు. అప్పుడు భౌతిక దూరం పాటించడమనేది కష్టమవుతుంది. కరోనాకు మందు కనుగొనేంత వరకు క్రికెట్​ మ్యాచ్​ల నిర్వహణ వాయిదా వేయడమే మంచిది"

-హర్భజన్​సింగ్​, టీమిండియా మాజీ క్రికెటర్​

cricket ground
క్రికెట్ మైదానం

"చెపాక్​లో ప్రాక్టీసు సెషన్స్​​ జరిగేటప్పుడే అధిక సంఖ్యలో అభిమానులు వచ్చారు. అప్పుడే వారిని స్టేడియంలోకి అనుమతించలేదు. అలాంటిది ఇప్పుడు వారు లేకుండా మ్యాచ్​ జరిగితే వారు ఊరుకుంటారా? ఎక్కువ సంఖ్యలో వస్తారు. అలాంటి సమయంలో వారిని ఆపడం కష్టమవుతుంది"

-విశ్వనాథన్​, చెన్నై సూపర్​ కింగ్స్ సీఈఓ

ఫుట్​బాల్​కు ఆదరణ పెరిగే అవకాశం

ఇదే విషయంపై మాట్లాడిన భారత ఫుట్​బాల్​ దిగ్గజం బైచుంగ్​ భాటియా.. భిన్నంగా స్పందించాడు. ఫుట్​బాల్​ మ్యాచ్​లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని సూచించాడు.

"ప్రస్తుతం మనదగ్గర ఎటువంటి క్రీడలు జరగడం లేదు. భారత్​లో ఫుట్‌బాల్​కు ఆదరణ పెరగాలంటే ఇదే మంచి సమయం. దేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో, ప్రభుత్వం అనుమతిస్తే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు జరపాలని కోరుతున్నా"

- బైచుంగ్​ భాటియా, భారత మాజీ ఫుట్​బాలర్

అయితే బైచుంగ్​ భాటియా వ్యాఖ్యలను ఆల్ ఇండియా ఫుట్​బాల్ ఫెడరేషన్ ఉఫాధ్యక్షులు సుబ్రతా దత్తా ఖండించారు.

ఇదీ చూడండి : దేశవాళీ లీగ్​తో రీఎంట్రీ ఇవ్వనున్న ధోనీ!

Last Updated : Apr 22, 2020, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.