ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్‌బాష్ లీగ్‌లో క్రిస్ లిన్ విధ్వంసకర ప్రదర్శన చేశాడు. బ్రిస్బేన్ హీట్‌కు కెప్టెన్‌గా ఉన్న లిన్.. ఆదివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. స్ట్రయిక్ రేట్ 268.57గా నమోదైంది. ఇతడి ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది బ్రిస్బేన్ జట్టు. ఈ క్రమంలో లీగ్‌లో 2వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు లిన్.
-
9️⃣4️⃣ runs
— T20 World Cup (@T20WorldCup) December 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
3️⃣5️⃣ balls
1️⃣1️⃣ sixes
Chris Lynn, you are a machine! 🤯 pic.twitter.com/pUPGZIGe9D
">9️⃣4️⃣ runs
— T20 World Cup (@T20WorldCup) December 22, 2019
3️⃣5️⃣ balls
1️⃣1️⃣ sixes
Chris Lynn, you are a machine! 🤯 pic.twitter.com/pUPGZIGe9D9️⃣4️⃣ runs
— T20 World Cup (@T20WorldCup) December 22, 2019
3️⃣5️⃣ balls
1️⃣1️⃣ sixes
Chris Lynn, you are a machine! 🤯 pic.twitter.com/pUPGZIGe9D
వేలంలో కనీస ధర...
ఈ నెల 19న కోల్‌కతా వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ వేలంలో.. లిన్‌ను కనీస ధర రూ.2 కోట్లకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్. గతంలో రూ. 9.6 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఈ వేలం ముందు అనూహ్యంగా అతడిని వదులుకుంది. ఐపీఎల్ 2018, 2019 సీజన్లో ఆ జట్టు టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచిన క్రిస్ లిన్‌ను వదులుకోవడంపై అభిమానులే కాకుండా యువరాజ్ లాంటి క్రికెటర్లూ ఆశ్చర్యపోయారు.