ETV Bharat / sports

'నాకు నచ్చకపోతే నా ముఖంలోనే తెలుస్తుంది' - rohit

రోహిత్​తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు విరాట్​ కోహ్లీ. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే నా ముఖంలోనే కనిపిస్తుందని చెప్పాడు. ఈ అబద్ధాలను పెంచి పోషించొద్దని తెలిపాడు.

విరాట్ కోహ్లీ
author img

By

Published : Jul 29, 2019, 9:19 PM IST

రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయంటూ వస్తోన్న కథనాలను ఖండించాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. ఇలాంటి ఊహాగానాలు రావడం దారుణమని తెలిపాడు. రోహిత్​తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అబద్ధాలను నమ్మొద్దని చెప్పాడు కోహ్లీ.

"నా అభిప్రాయం ప్రకారం ఈ కథనాలు అనవసరమైనవి. చాలా దారుణంగా ఉన్నాయి. అబద్ధాలను పెంచి పోషిస్తున్నారు. రోహిత్​తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడకపోతే అది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని రోజులుగా చాలా వార్తలు విన్నా. ఒకవేళ అవే నిజమైతే జట్టులో పరిస్థితులు సరిగా ఉండేవి కావు. మేము మంచి ప్రదర్శన చేసే వాళ్లం కాదు" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

రోహిత్​, కోహ్లీపై వస్తోన్న వార్తలను ఇంతకుముందే ఖండించాడు రవిశాస్త్రి. అవన్నీ పనికి రాని చెత్తమాటలు అంటూ ఘాటుగా స్పందించాడు.

ప్రపంచకప్​లో భారత్​ సెమీస్​లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత కెప్టెన్సీని కోహ్లీ నుంచి రోహిత్​కు అప్పగిస్తారని అనుకున్నారు. అయితే విండీస్ పర్యటనకు విరాట్​నే సారథిగా కొనసాగించింది సెలక్షన్ కమిటీ. ఈ కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని కథనాలు వచ్చాయి.

ఇది చదవండి: 'కెప్టెన్సీపై సమావేశం ఎందుకు జరగలేదు'

Intro:Body:

U

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.