ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ సవ్యంగా సాగి ఉంటే మ్యాచ్ చివరి ఓవర్ వరకూ వచ్చోదే కాదు. మ్యాచ్‌ను ఆఖరి బంతి వరకూ తీసుకొచ్చిన సామ్ కరన్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను హార్దిక్ అందుకోలేకపోయాడు. 22 పరుగుల వద్ద ఉన్నపుడు ఇన్నింగ్స్ 34వ ఓవర్లో ప్రసిద్ధ్ బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అంతకు ముందు ఇన్సింగ్స్ ఐదో ఓవర్లోనే భువీ బౌలింగ్‌లో చేతుల్లో పడ్డ స్టోక్స్ క్యాచ్‌ను హార్దిక్ పట్టలేకపోయాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో స్టోక్స్ ఔటయ్యాక.. ఉపశమనం పొందినట్లు మైదానంలో మెకాళ్లపై వంగి బౌలరకు హార్దిక్ దండాలు పెడుతూ కనిపించాడు. అయితే అదే హార్దిక్.. మొయిన్ అలీ క్యాచ్‌ను ముందుకు డైవ్‌చేస్తూ అందుకోవడం విశేషం.
మరోవైపు రనౌట్ చేసే అవకాశాలను భారత్ వృధా చేసుకుంది. ఒక్క త్రో కూడా వికెట్లకు తాకలేదు. చివర్లో ఇంగ్లాండ్ విజయానికి 10 బంతుల్లో 18 పరుగులు అవసర మైన దశలో మార్క్ వుడ్ ఇచ్చిన క్యాచ్‌ను శార్దూల్ అందుకోలేకపోయాడు ఆ తర్వాతి బంతికే కరన్ వికెట్ల వెనుక గాల్లోకి లేపిన బంతిని నటరాజన్ పట్టలేకపోయాడు. ఓ వైపు సహచర ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో విఫలమైనప్పటికీ కెప్టెన్ కోహ్లీ మాత్రం మరోసారి అద్భుత రీతిలో క్యాచ్ అందుకుని అబ్బురపరిచాడు. శార్టూల్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ రెండో బంతికి రషీద్ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో ఉన్న కోహ్లీ నమ్మశక్యంగా కాని విధంగా అందుకున్నాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అంచనా వేసిన అతను తన ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో పట్టుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">