ఇంగ్లాండ్‌తో డే/నైట్ టెస్టులో భారత్ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా లేని లోటును బొత్తిగా కనపడనివ్వలేదు.
అచ్చం అలానే..
అక్షర్ తీసిన వికెట్లు, బౌలింగ్ శైలితో అతడికీ, జడ్డూకు మధ్య సారూప్యత కనిపిస్తోందంటున్నారు మాజీలు. బంతి తిరుగుతుందని అనుకునే సమయంలో నేరుగా వెళ్లడం, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడం వంటివి జడేజాను తలపిస్తున్నాయని చెబుతున్నారు. వారిద్దరికీ తమ బలాలు, బలహీనతలు తెలుసని.. అదే వారికి అతిపెద్ద బలమని టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ మణిందర్ సింగ్ అన్నారు.
సొంత ప్రేక్షకుల మధ్య..
గుజరాత్లో సొంత ప్రేక్షకుల ముందు ఆటడం పట్ల హర్షం వ్యక్తంచేశాడు అక్షర్. " నా రెండో టెస్టు, మొతేరాలో తొలి మ్యాచ్ సొంత గడ్డపై ఆడటం సంతోషంగా ఉంది. కుటుంబం ముందు స్థానిక ప్రేక్షకులు కేరింతలు కొడుతుంటే ఉత్సాహం రెట్టింపవుతుంది. నేను జట్టులోకి వచ్చే రెండు, మూడేళ్ల ముందు వరకు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వాటిని అధిగమించడానికి నా కుటుంబం, స్నేహితులు ఎంతగానో సహకరించారు. అవకాశం వచ్చినప్పుడు వంద శాతం కష్టపడాలని నాకు తెలుసు." అని అక్షర్ అన్నాడు.
ఇదీ చదవండి:మొతేరా పిచ్‌పై దెయ్యాలేం లేవు: రోహిత్