దిల్లీ వేదికగా జరగుతున్న చివరి వన్డేలో భారత బౌలర్లు చెలరేగారు. ఖవాజా, హాండ్స్‌కాంబ్ మెరుపులతో భారీ స్కోరు చేస్తుందనుకున్న ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో 50 ఓవర్లలో 272 పరుగులే చేయగలిగింది ఆసీస్ జట్టు. భారత్‌కు 273 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
Innings Break!#TeamIndia restrict Australia to a total of 272/9 in 50 overs
— BCCI (@BCCI) March 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard - https://t.co/8JniSIXQKn #INDvAUS pic.twitter.com/dyHKwRSLgI
">Innings Break!#TeamIndia restrict Australia to a total of 272/9 in 50 overs
— BCCI (@BCCI) March 13, 2019
Scorecard - https://t.co/8JniSIXQKn #INDvAUS pic.twitter.com/dyHKwRSLgIInnings Break!#TeamIndia restrict Australia to a total of 272/9 in 50 overs
— BCCI (@BCCI) March 13, 2019
Scorecard - https://t.co/8JniSIXQKn #INDvAUS pic.twitter.com/dyHKwRSLgI
ఖవాజా మెరుపు శతకం..
ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో ఖవాజా ఆటే ప్రధాన ఆకర్షణ. గత మ్యాచ్‌లో 91 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ వన్డేలో 100 పరుగులతో అదరగొట్టాడు. తొలి వికెట్‌కు ఫించ్‌తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించిందీ ఖవాజా- హ్యాండ్స్కోంబ్ ద్వయం.
హాండ్స్కోంబ్ అర్ధశతకం..
మూడో స్థానంలో వచ్చిన హాండ్స్‌కాంబ్ 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఉన్నంత సేపు ధాటిగా ఆడిన ఈ బ్యాట్స్‌మెన్ షమీ బౌలింగ్‌లో పంత్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
వీరిద్దరు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. గత మ్యాచ్ హీరో టర్నర్ 20 పరుగులే చేశాడు. ఫించ్ 27, మాక్స్వెల్ 1, కారీ 3 పరుగులకే పరిమితమయ్యారు. చివర్లో వచ్చిన కమిన్స్ 15 పరుగులు, రిచర్డ్సన్ 29 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
మెరిసిన భారత బౌలర్లు
Back to back wickets, Khawaja and Maxwell depart.
— BCCI (@BCCI) March 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Australia 178/3 https://t.co/8JniSIXQKn #INDvAUS pic.twitter.com/ykDsQHuz7K
">Back to back wickets, Khawaja and Maxwell depart.
— BCCI (@BCCI) March 13, 2019
Australia 178/3 https://t.co/8JniSIXQKn #INDvAUS pic.twitter.com/ykDsQHuz7KBack to back wickets, Khawaja and Maxwell depart.
— BCCI (@BCCI) March 13, 2019
Australia 178/3 https://t.co/8JniSIXQKn #INDvAUS pic.twitter.com/ykDsQHuz7K
గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులిచ్చినా భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. భువనేశ్వర్ మూడు వికెట్లు తీయగా.. జడేజా, షమీ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ తీశాడు.