ETV Bharat / sports

పీఎస్​ఎల్​లో క్రికెటర్​కు కరోనా.. మ్యాచ్​ వాయిదా - islamabad united news

ఆస్ట్రేలియా లెగ్​ స్పిన్నర్​ ఫవాద్​ అహ్మద్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో ఇస్లామాబాద్​ జట్టు తరఫున ఆడుతున్న ఫవాద్​కు కొవిడ్​ సోకిన తర్వాత టోర్నీలో నేడు (సోమవారం) జరగాల్సిన మ్యాచ్​ను మంగళవారానికి వాయిదా వేశారు లీగ్​ నిర్వాహకులు.

Australian player Fawad Ahmed tests positive for COVID-19
పీఎస్​ఎల్​లో క్రికెటర్​కు కరోనా.. మ్యాచ్​ వాయిదా
author img

By

Published : Mar 1, 2021, 9:41 PM IST

Updated : Mar 1, 2021, 9:50 PM IST

పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో ఆడుతున్న ఆస్ట్రేలియా లెగ్​ స్పిన్నర్​ ఫవాద్​ అహ్మద్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ లీగ్​లో ఇస్లామాబాద్​ యునైటెడ్​ జట్టుకు ఫవాద్​ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చేసిన కొవిడ్​ పరీక్షల్లో టీమ్​లోని మిగిలిన ఆటగాళ్లకు వైరస్​ లక్షణాలు కనిపించలేదు. దీంతో కరోనా సోకిన ఫవాద్​​ను ఐసోలేషన్​కు తరలించినట్లు ఇస్లామాబాద్​ ఫ్రాంఛైజీ తెలిపింది.

ఇస్లామాబాద్​ యునైటెడ్​, క్వెట్టా గ్లాడియేటర్స్​ మధ్య సోమవారం మ్యాచ్​ జరగాల్సి ఉండగా.. ఫవాద్​ అహ్మద్​కు కరోనా సోకిన కారణంగా ఆ మ్యాచ్​ను మంగవారానికి వాయిదా వేశారు.

పీఎస్​ఎల్​ ప్రస్తుత సీజన్​లో ఒకే ఒక్క మ్యాచ్​ ఆడిన ఫవాద్..​ పెషావర్​ జల్మీ జట్టుపై 40 పరుగులిచ్చి ఒక వికెట్​ తీశాడు. ఆ మ్యాచ్​లో ఇస్లామాబాద్​ జట్టు ఓడిపోయింది.

ఇదీ చూడండి: వారెవ్వా.. ఏం క్యాచ్​ గురూ!

Last Updated : Mar 1, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.