ఆస్ట్రేలియా పేసర్ మిచ్ క్లేడాన్ బంతికి శానిటైజర్ ఉపయోగించాడని ఇటీవలే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణలో భాగంగా ససెక్స్ కౌంటీ క్లబ్ అతడిని సస్పెండ్ చేసింది. ఆగస్టులో మిడిల్సెక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో క్లేడాన్.. మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్లో కఠినమైన నిబంధనలు విధించారు అధికారులు. బంతి మెరుపు కోసం లాలాజలం ఉపయోగాన్ని నిషేధించారు.