ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షూట్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లలో హ్యాట్రిక్ సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో వరుస బంతుల్లో ముగ్గురిని పెవిలియన్ చేర్చింది. ఆసీస్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రీడాకారిణిగానూ గుర్తింపు పొందింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 180 పరుగులకే పరిమితమైంది. మేగాన్ 10 ఓవర్ల కోటాలో 9.3 ఓవర్లకు ఒక్క వికెటూ సాధించలేదు. కానీ చివరి ఓవర్ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సాధించింది.
వన్డేల కంటే ముందు టీ20లో హ్యాట్రిక్ సాధించింది మేగాన్. గతేడాది మార్చిలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా స్మృతి మందణ్న, మిథాలీ రాజ్, దీప్తి శర్మలను పెవిలియన్ పంపింది.
ఇవీ చూడండి.. అవన్నీ పుకార్లే : ధోనీ భార్య సాక్షి సింగ్