ETV Bharat / sports

'రోహిత్​ను ఔట్ చేయడం పెద్ద సవాల్'

టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్ ​శర్మను ఔట్​ చేయడం ఆస్ట్రేలియా బౌలర్లకు పెద్ద సవాలని ఆ జట్టు స్పిన్నర్​ నాథన్​ లియోన్​ అభిప్రాయపడ్డాడు. హిట్​మ్యాన్​ను ఔట్​ చేసేందుకు ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందించామని ప్రెస్​మీట్​లో వెల్లడించాడు.

Australia will have plans set for world-class Rohit Sharma: Lyon
రోహిత్​ను ఔట్​ చేసేందుకు ఆసీస్​ ప్రణాళికలు!
author img

By

Published : Jan 4, 2021, 1:38 PM IST

టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​శర్మను ఔట్​ చేసేందుకు తమ జట్టు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​ తెలిపాడు. రోహిత్​ లాంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్​మన్​ను ఎదుర్కోవడం ఆసీస్​ బౌలర్లకు పెద్ద సవాలని అభిప్రాయపడ్డాడు.

వర్చువల్​ ప్రెస్​మీట్​లో మాట్లాడుతున్న ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్ లియోన్​

"ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్​మెన్​లో రోహిత్​శర్మ ఒకడు అని చెప్పడంలో సందేహం లేదు. అతనితో ఆడడం మా బౌలర్లకు పెద్ద సవాలే. కానీ, అలాంటి సవాళ్లను మేమూ ఆస్వాదిస్తాం. టీమ్ఇండియాలో రోహిత్​ శర్మ బలమైన బ్యాట్స్​మన్​. అతడ్ని ఎవరు ఔట్​ చేస్తారనే దానిపై ఆసక్తి ఉంటుంది. కానీ, రోహిత్​ను ఔట్​ చేసేందుకు మా దగ్గర తగినన్ని ప్రణాళికలు ఉన్నాయి. వీలైనంత త్వరగానే ఔట్​ చేయాలని భావిస్తున్నాం. కానీ, రోహిత్​ను గౌరవిస్తాం".

- నాథన్​ లియోన్​, ఆస్ట్రేలియా స్పిన్నర్​

గాయం నుంచి ఇటీవలే కోలుకుని ఆస్ట్రేలియా చేరుకున్న రోహిత్​ శర్మ.. ఆసీస్​తో జరగబోయే టెస్టు సిరీస్​లో మిగిలిన రెండు మ్యాచ్​లకు వైస్​ కెప్టెన్​గా ఎంపికయ్యాడు. నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో చెరో మ్యాచ్​లో గెలుపొంది 1-1 సిరీస్​ను ఇరుజట్లు సమం చేశాయి. మూడో టెస్టు ఈనెల 7న సిడ్నీ వేదికగా జరగనుంది.

ఇదీ చూడండి: 'ప్రేక్షకులకు లేని క్వారంటైన్​ మాకెందుకు?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.