ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డేలో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. కరోనా ప్రభావంతో క్రీడాకారులు ప్రత్యర్థులతో కరచాలనం చేయోద్దని ఆయా బోర్డులు ఆటగాళ్లకు సూచించాయి. ఇప్పటికే ఈ విషయంలో ఇంగ్లాండ్ అన్ని జట్లకన్నా ముందుంది. ప్రత్యర్థి ఆటగాళ్లతో కరచాలనానికి బదులు ఫిస్ట్‌బంప్స్ చేయాలని నిర్ణయించుకుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఇతర ఆటగాళ్లూ కరచాలనం చేయడానికి భయపడుతున్నారు. ఈరోజు ఆస్ట్రేలియా X న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఆయా జట్ల సారథులు అలవాటులో పొరపాటు చేశారు. టాస్ వేసేటప్పుడు ఆరోన్ ఫించ్, కేన్ విలియమ్సన్ ఎప్పటిలాగే కరచాలనం చేసుకొని తర్వాత నవ్వుకున్నారు. ఆపై మోచేతులను తాకించుకొని వెళ్లిపోయారు.
ఆటగాళ్లే బంతి తెచ్చుకోవాలి ..!
ఈ వన్డే సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రేక్షకులను అనమతించకుండా నిర్ణయం తీసుకుంది. ఖాళీ స్టాండ్ల మధ్యే ఇరు జట్లూ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. ఫించ్ కొట్టిన భారీ సిక్స్ స్టాండ్స్‌లోకి దూసుకుపోయింది. అక్కడ బంతిని అందివ్వడానికి ఎవ్వరూ లేకపోవడం వల్ల ఫీల్డర్ ఫెర్గుసన్ ఖాళీ స్టాండ్స్‌లోకి వెళ్లి బంతిని వెతికి మైదానంలోకి విసిరాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లోనూ జేమ్స్ నీషమ్ సిక్సర్ కొట్టగా.. ఆసీస్ బౌలర్ ఆస్టన్ అగర్ స్టాండ్స్‌లో బంతిని వెతికి తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
-
Good arm, Lockie! #AUSvNZ pic.twitter.com/xY7QtF5UGf
— cricket.com.au (@cricketcomau) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Good arm, Lockie! #AUSvNZ pic.twitter.com/xY7QtF5UGf
— cricket.com.au (@cricketcomau) March 13, 2020Good arm, Lockie! #AUSvNZ pic.twitter.com/xY7QtF5UGf
— cricket.com.au (@cricketcomau) March 13, 2020
-
Like a needle in a haystack#AUSvNZ pic.twitter.com/T6A29tKaYj
— cricket.com.au (@cricketcomau) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Like a needle in a haystack#AUSvNZ pic.twitter.com/T6A29tKaYj
— cricket.com.au (@cricketcomau) March 13, 2020Like a needle in a haystack#AUSvNZ pic.twitter.com/T6A29tKaYj
— cricket.com.au (@cricketcomau) March 13, 2020
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ వార్నర్ (67), ఫించ్ (60), లబుషేన్ (56) అర్ధశతకాలతో రాణించగా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఛేదనలో 41 ఓవర్లలో 187 రన్స్‌కు ఆలౌటైంది న్యూజిలాండ్ జట్టు. గప్తిల్(40), లాథమ్(38) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ఫలితంగా ఆసీస్ 71 పరుగుల తేడాతో గెలిచింది. కరోనా సెగ తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ అభిమానులు లేకుండా జరగడమే కాకుండా ఫలితమూ తేలింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు చప్పట్లు కొట్టుకుంటూ అభినందించుకున్నారు.
-
This is a no-handshake zone! #AUSvNZ pic.twitter.com/DNrppiGxC2
— cricket.com.au (@cricketcomau) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is a no-handshake zone! #AUSvNZ pic.twitter.com/DNrppiGxC2
— cricket.com.au (@cricketcomau) March 13, 2020This is a no-handshake zone! #AUSvNZ pic.twitter.com/DNrppiGxC2
— cricket.com.au (@cricketcomau) March 13, 2020