ఈ ఏడాది సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఆడనుంది ఆస్ట్రేలియా. ఇందుకోసం 26 మందితో కూడిన ప్రిలిమినరీ జాబితాను విడుదల చేసింది ఆసీస్ క్రికెట్ బోర్డు. వీరిలో డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్పి కొత్త ఆటగాళ్లు.
గత అక్టోబరు నుంచి తాత్కాలిక విరామంలో ఉన్న ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా స్టోయినిస్‌ను జట్టులోకి తీసుకుంది. సారథి పీటర్ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్ నైల్‌ను పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ వన్డే సిరీస్ కార్యాచరణపై ఇంగ్లాండ్ బోర్డుతో చర్చలు జరుపుతోంది ఆస్ట్రేలియా బోర్డు.

ప్రిలిమినరీ జట్టు : సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, ఆరోన్ ఫించ్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, లైయన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, మైఖేల్ నేసర్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్ , డి ఆర్సీ షార్ట్, కేన్ రిచర్డ్సన్, స్టీవెన్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా

ఇది చూడండి : అతడు కవ్వించాడనే ఫాస్ట్ బౌలర్ అయ్యాను : కపిల్