ETV Bharat / sports

భారత బౌలర్లు భళా.. ఆస్ట్రేలియా 195 ఆలౌట్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020

బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆతిధ్య ఆసీస్​ 195 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్​తోనే సిరాజ్, గిల్.. భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేశారు.

Australia got all out in second test against india
భారత బౌలర్లు
author img

By

Published : Dec 26, 2020, 11:31 AM IST

Updated : Dec 26, 2020, 12:15 PM IST

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. దీంతో ఆతిథ్య ఆసీస్​ 195 పరుగులకే ఆలౌట్​ అయింది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. మెల్​బోర్న్ వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

team india bowlersటెస్టుల్లో తొలి వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆచితూచి ఆడింది. దీంతో తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30, గ్రీన్ 12, పైన్ 13 మినహా అందరూ సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశాడు.

గత కొన్నిరోజుల క్రితం మరణించిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్​కు టీ విరామం సమయంలో నివాళి అర్పించారు. ఆయన టోపీ, బ్యాట్, కళ్లజోడును తీసుకొచ్చి, వికెట్ల దగ్గర పెట్టారు. ఈ ఫొటోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పంచుకుంది.

paid tribute to dean jones
మెల్​బోర్న్ క్రికెట్ మైదానంలో దిగ్గజ డీన్ జోన్స్​కు నివాళి

Last Updated : Dec 26, 2020, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.