ETV Bharat / sports

రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా - స్లో ఓవర్​ రేటుకు ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా

బాక్సింగ్​ డే టెస్టులో స్లో ఓవర్​ రేటు కారణంగా ఆస్ట్రేలియా మ్యాచ్​ ఫీజులో కోత పడింది. అలానే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో నాలుగు పాయింట్లను తగ్గిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టులో భారత్, 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం సొంతం చేసుకుంది.

Australia fined for slow over-rate in second Test against India
స్లో ఓవర్​ రేటు కారణంగా ఆస్ట్రేలియాకు జరిమానా
author img

By

Published : Dec 29, 2020, 3:54 PM IST

టీమ్​ఇండియాతో జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్​ రేటు కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. దీనితో పాటే టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్లను నాలుగు తగ్గించింది. మెల్​బోర్న్​లో నాలుగు రోజు ఆటలో ఆసీస్​.. నిర్ణీత సమయం కంటే రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్​ చేసింది. దీంతో ఐసీసీ ఎలైట్​ ప్యానల్​ మ్యాచ్ రిఫరీ డేవిడ్​ బూన్​.. కంగారూ జట్టు ఫీజులో కోత విధించారు.

ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్​ 2.22 ప్రకారం.. మ్యాచ్​లో కనీస ఓవర్​ రేటు కంటే తక్కువగా నమోదైతే ఓవర్​కు 20 శాతం చొప్పున మ్యాచ్​ ఫీజులో కోత విధించాల్సి ఉంటుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​కు సంబంధించిన ఆర్టికల్​ 16.11.2 ప్రకారం.. కనీస ఓవర్​ రేటు తక్కువైన సమయంలో ప్రతి ఓవర్​కు ఆ జట్టు సాధించిన పాయింట్లలో రెండింటిని కోత విధిస్తారు. టీమ్​ఇండియాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా రెండు ఓవర్ల తక్కువ రేటుతో బౌలింగ్​ చేసిన ఫలితంగా ఆసీస్​ జట్టు మ్యాచ్​ ఫీజులో 40 శాతం కోతతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ పాయింట్లలో నాలుగింటిని తగ్గించారు.

కెప్టెన్​ అంగీకారం

ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​ అంగీకరించడం వల్ల మైదానంలోని అంపైర్ల అభిప్రాయం తీసుకోవాల్సి అవసరం లేకుండా పోయింది. ఈ మ్యాచ్​లో మైదానంలో అంపైర్లుగా బ్రూస్​ ఆక్సిన్​ఫోర్డ్​, పాల్​ రీఫెల్​.. థ్రర్డ్​ అంపైర్​గా పాల్​ విల్సన్​, నాలుగో అంపైర్​గా గెరాడ్​ అబూద్​ విధులు నిర్వర్తించారు.

ఏడాదిలో తొలి విజయం

ఐపీఎల్‌ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన భారత్..‌ అడిలైడ్‌ టెస్టులో ఘోరంగా ఓడింది. రెండో టెస్టులో గెలిచి, ఆస్ట్రేలియాకు దీటుగా బదులివ్వడమే కాకుండా ఈ ఏడాదిని విజయంతో ముగించింది.

ఇదీ చూడండి: రహానె ఇన్నింగ్స్ టర్నింగ్ పాయింట్: రవిశాస్త్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.