అడిలైడ్ వేదికగా టీమ్ఇండియాతో జరిగిన డే నైట్ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో గెలిచి నాలుగు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీసేన ఆసీస్ ముందు 90 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆసీస్.
ఓపెనర్లు మాథ్యూ వేడ్(33), జో బర్న్స్(51*) నిలకడగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే వేడ్ రనౌటయ్యాక, మార్నస్ లబుషేన్(6) కూడా విఫలమయ్యాడు. చివరికి స్మిత్(1)తో కలిసి బర్న్స్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. రెండో టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభంకానుంది.