మెల్బోర్న్ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. 159 పగుగుల ఆధిక్యంలో ఆసీస్ ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్క్ బౌలింగ్‌లో ఓపెనర్‌గా దిగిన మయాంక్ అగర్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకముందే భారత్ తొలి వికెట్ చేజార్చుకుంది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా ఉన్నారు. వీరిద్దరూ 8 ఓవర్లకు 28 పరుగులు చేశారు.
అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతూ ఆడింది. భారత బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను గట్టిగా దెబ్బతీశారు. దీంతో ఆతిథ్య ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30, గ్రీన్ 12, పైన్ 13 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">