ETV Bharat / sports

టీమ్​ఇండియాకు లక్కీ స్టేడియం.. మెల్​బోర్న్​! - టీమ్ఇండియా లక్కీ స్టేడియం మెల్​బోర్న్

మెల్​బోర్న్​ మైదానంలో జరిగిన బాక్సింగ్​ డే టెస్టులో టీమ్​ఇండియా అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మైదానంలో భారత్​ అంతకు ముందు కూడా మంచి అనుబంధమే ఉంది. గతంలో ఇక్కడే ఆడిన నాలుగు టెస్టుల్లో టీమ్​ఇండియా గెలవడమే ఇందుకు కారణం.

AUS vs IND: MCG turns out lucky for India again
ఆసీస్​ గడ్డపై టీమ్​ఇండియాకు లక్కీ స్టేడియం.. మెల్​బోర్న్​!
author img

By

Published : Dec 29, 2020, 7:51 PM IST

మెల్​బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్​ డే టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. అయితే ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు ఆడిన 50 టెస్టుల్లో టీమ్​ఇండియా ఎనిమిదింటిలో గెలుపొందింది. వాటిలో సగం అంటే నాలుగు మ్యాచ్​లు మెల్​బోర్న్​ మైదానంలో జరిగినవే కావడం విశేషం. మిగిలిన నాలుగింటిలో పెర్త్​ (2008), సిడ్నీ (1978), అడిలైడ్​లో రెండుసార్లు (2003, 2018) భారత్ గెలిచింది.

మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్స్​లో టీమ్​ఇండియా విజయాలు:

1978

AUS vs IND: MCG turns out lucky for India again
భగవత్ చంద్రశేఖర్

1978లో జరిగిన టెస్టులో భారత లెగ్​-స్పిన్నర్​ భగవత్​ చంద్రశేఖర్ 12 వికెట్లు (రెండు ఇన్నింగ్స్​ల్లో తలో 6) పడగొట్టడం సహా 104 పరుగులు చేశాడు. దీంతో టీమ్ఇండియా 222 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఈ వేదికలో టీమ్​ఇండియాకు ఇదే తొలి విజయం. కెప్టెన్​గా బిషన్​ బేడీ. తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 256, ఆస్ట్రేలియా 213 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్​లో భారత రెచ్చిపోయి బ్యాటింగ్​ చేసి 343 స్కోరు నమోదు చేసింది. ఆ ఇన్నింగ్స్​లో గావస్కర్​(118) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసీస్​ బ్యాట్స్​మెన్​ను 164 పరుగులకే కట్టడి చేయడం వల్ల 222 పరుగుల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది.

1981

కపిల్ దేవ్​

1981లో జరిగిన టెస్టులో దాదాపుగా ఓడిపోయే మ్యాచ్​ను అప్పటి టీమ్​ఇండియా ఆల్​రౌండర్​​ కపిల్​ దేవ్​ గెలిపించాడు. తొలి ఇన్నింగ్స్​లో భారత బ్యాట్స్​మన్​ గుండప్ప విశ్వనాథ్​(114) సెంచరీ చేయడం వల్ల జట్టు స్కోరు 237కు చేరింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 419 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమ్ఇండియా ముందుంచింది. రెండో ఇన్నింగ్స్​లో భారత్​ 324 పరుగులు చేసి ఆసీస్​ కంటే స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఈ పరిస్థితిలో ఆసీస్​ బ్యాట్స్​మెన్​ను 83 పరుగులకు ఆలౌట్​ చేసి 59 పరుగుల తేడాతో టీమ్ఇండియా విజయాన్ని అందుకుంది. ఆసీస్​ను తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కపిల్​ దేవ్​(5 వికెట్లు) కీలకపాత్ర పోషించాడు.

2018

జస్​ప్రీత్​ బుమ్రా

టీమ్​ఇండియా పేసర్​ బుమ్రాకు ఆస్ట్రేలియా తొలి పర్యటన ఇదే. మెల్​బోర్న్​ వేదికగా జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లో 86 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్​పై 137 పరుగుల భారీ వ్యత్యాసంతో టీమ్​ఇండియా విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్.. 7 వికెట్లు కోల్పోయి 443 పరుగులకు డిక్లేర్డ్​ ప్రకటించింది. ఆ ఇన్నింగ్స్​లో బుమ్రా ఆరు వికెట్లతో ప్రత్యర్థిపై రెచ్చిపోయి బౌలింగ్​ చేయగా ఆసీస్​ 151 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకు డిక్లేర్డ్​ ప్రకటించింది. ఆ తర్వాత ఆతిథ్య జట్టును 261 పరుగులకే కట్టడి చేయగలిగింది.

2020

అజింక్య రహానె

ప్రస్తుతం జరుగుతోన్న టెస్టు సిరీస్​లోని తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం తర్వాత రెండో టెస్టు(బాక్సింగ్​ డే టెస్టు)కు అజింక్య రహానె తాత్కాలిక కెప్టెన్​గా ఎంపికయ్యాడు. కెప్టెన్​ ఇన్నింగ్స్​తో సెంచరీ చేసిన రహానె (112) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 195, టీమ్​ఇండియా 326 పరుగులే చేశాయి. ఆ తర్వాత బ్యాటింగ్​ దిగిన ఆతిథ్య జట్టు 200 పరుగులకే ఆలౌటైంది. 70 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు సులువుగా లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్సీ విషయంలో రహానె మంచి మార్కులు పడ్డాయి.

ఇదీ చూడండి: రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.