బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించాడీ హీరో. 'ధోని' బయోపిక్‌లో క్రికెట్ ప్రేమికులంతా సుశాంత్‌లో మహీని చూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ మృతిపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ సంతాపం తెలిపాడు. 'ధోని: అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంలో ప్రేక్షకులంతా సుశాంత్ నటన చూసి మైమరచిపోయారని గుర్తు చేసుకున్నాడు.
-
I can’t stop thinking about #sushantsinghrajput. It is just so tragic!!! In The Untold Story, at times you forgot whether it was Sushant or MSD. Amazing portrayal and now the world is much poorer with him not here in it. #gonetoosoon pic.twitter.com/pFYz4cD9jK
— Shane Watson (@ShaneRWatson33) June 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I can’t stop thinking about #sushantsinghrajput. It is just so tragic!!! In The Untold Story, at times you forgot whether it was Sushant or MSD. Amazing portrayal and now the world is much poorer with him not here in it. #gonetoosoon pic.twitter.com/pFYz4cD9jK
— Shane Watson (@ShaneRWatson33) June 15, 2020I can’t stop thinking about #sushantsinghrajput. It is just so tragic!!! In The Untold Story, at times you forgot whether it was Sushant or MSD. Amazing portrayal and now the world is much poorer with him not here in it. #gonetoosoon pic.twitter.com/pFYz4cD9jK
— Shane Watson (@ShaneRWatson33) June 15, 2020
సుశాంత్ రాజ్‌పుత్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఇది ఒక విషాద ఘటన. 'ధోని' చిత్రంలో అచ్చం మహీలాగే నటించి సుశాంత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చిన్న వయసులో చనిపోవడం వల్ల ప్రపంచం ఓ మంచి నటుడ్ని కోల్పోయింది."
షేన్ వాట్సన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
సినిమా తెరకెక్కుతున్నపుడు భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరెతో పాటు, ధోని చిన్నప్పటి కోచ్ కేశవ్ బెనర్జీతో కలిసి రాజ్‌పుత్ అధిక సమయం గడిపాడు . తన ట్రైనింగ్‌లోనే మాహీ ప్రఖ్యాత హెలికాఫ్టర్ షాట్‌పై సుశాంత్ కసరత్తులు చేసినట్లు బెనర్జీ తెలిపారు. సుశాంత్ సున్నితమైన మనసున్నవాడని, అందరితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించేవాడని వివరించారు. న్యూస్ ఛానెల్లో సుశాంత్ మరణ వార్త విని నమ్మలేకపోయినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: