లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్‌కు సంబంధించిన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. 2010 సీజన్.. తనకు చెంపదెబ్బలాంటిదని అన్నాడు. ఒకానొక సమయంలో చెన్నై సూపర్‌కింగ్స్ రిజర్వ్‌బెంచ్‌కే పరిమితం చేసిందని చెప్పాడు. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌తో తాజాగా జరిగిన లైవ్‌సెషన్‌లో ఈ విషయాల్ని వెల్లడించాడు.
"ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో కన్నా టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా సులువు అనుకున్నా. అయితే ఐపీఎల్-2010లో రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో డెత్ ఓవర్లలో బౌలింగ్ చేశా. క్రీజులో రాబిన్ ఉతప్ప, మార్క్ బౌచర్ దూకుడుగా ఆడటం వల్ల 40-45 పరుగులు సమర్పించుకున్నాను. ఆ పరుగుల వల్లే మా జట్టు(చెన్నై) ఓటమిపాలైంది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో నాకు కనీసం తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈ విషయం నాకు చెంపపెట్టులాంటిది"
- రవిచంద్రన్ అశ్విన్, టీమిండియా సీనియర్ బౌలర్
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సుదీర్ఘకాలంపాటు ఆడిన అశ్విన్.. ఆ తర్వాత కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సారథిగా వ్యవహరించాడు. 2019 సీజన్‌లో బట్లర్‌ను మన్కడింగ్ చేసి, పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సీజన్ కోసం దిల్లీ క్యాపిటల్స్ ఇతడిని తీసుకుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది.
ఇదీ చూడండి : ఫామ్‌హౌజ్‌లో రయ్ రయ్ మంటూ ధోనీ, జీవా