ETV Bharat / sports

దిగ్గజ పథంలో.. రవిచంద్రన్ అశ్విన్! - రవిచంద్రన్ అశ్విన్

"ఇప్పటి నుంచి అశ్విన్‌ను దిగ్గజమని పిలుస్తా. అతను ఈ తరం క్రికెట్‌ దిగ్గజం".. ఇవీ ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించిన తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్న మాటలు. ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అవును.. భారత స్పిన్నర్‌ అశ్విన్‌ దిగ్గజంగా మారుతున్నాడు.

ashwin on the way to become a legend
దిగ్గజ పథంలో.. రవిచంద్రన్ అశ్విన్!
author img

By

Published : Feb 27, 2021, 6:55 AM IST

అనిల్‌ కుంబ్లే తర్వాత దేశంలో అత్యుత్తమ స్పిన్నర్‌గా ఎదిగే దిశగా సాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఓ దశలో జట్టులో చోటు ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో.. తనను తాను మార్చుకుని సరికొత్తగా బరిలో దిగి నిలకడైన బౌలింగ్‌తో రికార్డులు కొల్లగొడుతున్నాడు. వైవిధ్యమైన బౌలింగ్‌ను ఆయుధంగా మలుచుకుని.. అమ్ముల పొదిలో విభిన్న అస్త్రాలు చేర్చుకుని.. వికెట్ల వేటలో ముందుకు సాగుతున్నాడు. అతని ఈ ప్రయాణం ఇంకెంత దూరం కొనసాగుతుందో.. ఇంకెన్ని రికార్డులు వచ్చి ఖాతాలో చేరతాయో చూడాలి.

ashwin on the way to become a legend
రవిచంద్రన్ అశ్విన్

అనుకోకుండా వచ్చి.. అద్భుతం

రవిచంద్రన్‌ అశ్విన్‌.. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్‌గా వినిపిస్తున్న పేరు. అనుకోకుండా క్రికెటరైన అతను.. స్పిన్నర్‌గా మారి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆర్కిటెక్ట్‌ కెరీర్‌ను వదిలిన అతను.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బుట్టలో వేసుకునే ప్రణాళికలను పక్కాగా రూపొందిస్తున్నాడు. లేకపోతే.. 77 టెస్టుల్లోనే 400 వికెట్లు సాధించి భారత్‌ తరపున అత్యంత వేగంగా ఆ ఘనత అందుకున్న బౌలర్‌గా చరిత్ర తిరగరాసేవాడా? ప్రపంచ క్రికెట్లో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ (72 టెస్టులు) తర్వాత అతి తక్కువ టెస్టుల్లో ఆ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా నిలిచేవాడా? కెరీర్‌ ప్రమాదంలో పడ్డ దశ నుంచి అద్భుతంగా పుంజుకుని ప్రపంచ క్రికెట్లో సగర్వంగా నిలబడేవాడా? వీటన్నింటినీ సాధ్యం చేసి.. మరిన్ని మైలురాళ్లు చేరుకునే దిశగా అతను సాగుతున్నాడు.

ప్రస్తుతం 401 వికెట్లతో భారత్‌ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. అనిల్‌ కుంబ్లే (619), కపిల్‌ దేవ్‌ (434), హర్భజన్‌ సింగ్‌ (417) అతని కంటే ముందున్నారు. ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న అతనికి.. ఇదే జోరులో భజ్జీ, కపిల్‌లను దాటి ముందుకు వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదు.

ashwin on the way to become a legend
యాశ్

పడి లేచిన కెరటం..

ఏ వ్యక్తి జీవితంలోనైనా కష్టాలు ఉంటాయి. పెను సవాళ్లను దాటి ముందుకు సాగితేనే వీరుడు అంటారు. ఎంత పెద్ద కష్టాన్ని దాటితే అంత గొప్ప యోధుడిగా నిలుస్తారు. పరిస్థితులకు భయపడి వెనకడగు వేస్తే విజయాలు అందుకోలేని వాడిగా మిగిలిపోతారు. ప్రతి ఆటగాడి కెరీర్‌లోనూ అలాంటి దశ ఉంటుంది. వైఫల్యాలు ఎదురవుతాయి. వాటిని అధిగమిస్తేనే ఛాంపియన్‌గా నిలవగలరు. అశ్విన్‌.. అలాంటి ఓ వీరుడు.. అలుపెరగని ఓ యోధుడు.. అత్యున్నత శిఖరాలకు చేరే దిశగా సాగుతున్న ఓ ఛాంపియన్‌. 2011లో టెస్టు అరంగేట్రం చేసి.. ఆరంభంలోనే తన ఆఫ్‌స్పిన్‌తో ఆకట్టుకుని.. తక్కువ కాలంలోనే జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా ఎదిగాడు. ఆరేళ్ల పాటు అతనికి తిరుగులేకుండా పోయింది. 2015 (62 వికెట్లు), 2016 (72), 2017 (56).. ఇలా వరుసగా మూడేళ్ల పాటు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా టెస్టుల్లో 200, 250 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులు సృష్టించాడు.

కానీ ఆ తర్వాత ఫామ్‌ కోల్పోవడం సహా మణికట్టు స్పిన్నర్లు జట్టులోకి రావడం వల్ల తన ప్రాధాన్యం తగ్గిపోయింది. 2018 నుంచి జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. అశ్విన్‌ లేకుండా టీమ్‌ఇండియా మ్యాచ్‌లాడడం, విజయాలూ సాధించడం వల్ల అతనితో పనేం లేదన్నట్లుగా పరిస్థితి తయారైంది. దాదాపు రెండేళ్ల పాటు ఒక్క టెస్టు ఇన్నింగ్స్‌లోనూ అయిదు వికెట్ల ఘనత సాధించలేకపోయాడు. పరిమిత ఓవర్ల జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో దేశవాళీల్లో తమిళనాడుకు ఆడుతూ బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. 2019 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికాతో విశాఖ టెస్టులో ఎనిమిది వికెట్లు పడగొట్టి టెస్టుల్లో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 350 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా మురళీధరన్‌ సరసన చేరాడు. నిరుడు లాక్‌డౌన్‌లో మరింతగా శ్రమించి సరికొత్తగా మైదానంలో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌లో బౌలింగ్‌తో మెరిసిన అతను.. తనలోని బ్యాట్స్‌మన్‌ను తిరిగి తట్టిలేపాడు.

ashwin on the way to become a legend
అశ్విన్

అన్ని రకాలుగా..

ఆస్ట్రేలియాతో సిరీస్‌ తర్వాత సరికొత్తగా కనిపిస్తున్న అశ్విన్‌ ఇప్పుడు అన్ని రకాలుగా జట్టుకు ఉపయోగపడుతున్నాడు. స్పిన్‌లో వైవిధ్యంతో, బ్యాటింగ్‌లో నిలకడతో మెరుస్తున్నాడు. స్పిన్నర్లంటే మామూలుగా పాతబడ్డ బంతిని గింగిరాలు తిప్పి వికెట్లు సాధిస్తారు. కానీ అశ్విన్‌ మాత్రం కొత్త బంతితోనూ అదే స్థాయిలో సత్తాచాటుతున్నాడు. అశ్విన్‌ టెస్టు అరంగేట్రం తర్వాత.. ప్రపంచ క్రికెట్లో చూసుకుంటే టెస్టు ఇన్నింగ్స్‌లో తొలి 15 ఓవర్లలో అతనిదే అత్యుత్తమ స్ట్రైక్‌రేట్‌. 47.4 స్ట్రైక్‌రేట్‌తో అతను 59 వికెట్లు తీశాడు. కనీసం 50 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితా చూస్తే కేవలం అశ్విన్‌ స్ట్రైక్‌రేట్‌ మాత్రమే 50లోపు ఉంది. స్టార్క్‌, రోచ్‌, ఫిలాండర్‌, బ్రాడ్‌, అండర్సన్‌, సౌథీ, బౌల్ట్‌ లాంటి పేసర్లు అతని తర్వాత ఉండడం విశేషం.

ఇప్పటివరకూ అశ్విన్‌ ఆడిన మ్యాచ్‌ల్లో మొత్తం భారత జట్టు పడగొట్టిన వికెట్లలో అతని శాతం 30.5గా ఉంది. జట్టు తీసిన వికెట్లలో తమ శాతం విషయంలో మురళీధరన్‌, రిచర్డ్‌ హాడ్లీ, కుంబ్లే మాత్రమే అతని కంటే ముందున్నారు. ఇక ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపడమంటే అశ్విన్‌కు మహా సరదా. ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో అత్యధికంగా 205 సార్లు లెఫ్టార్మ్‌ బ్యాట్స్‌మన్‌ను అతను ఔట్‌ చేశాడు. ఇక స్వదేశంలో అయితే అతనికి తిరుగేలేదు. ఇప్పటివరకూ సొంతగడ్డపై 46 టెస్టుల్లో 22.19 సగటుతో 278 వికెట్లు పడగొట్టాడు. కుంబ్లే (24.9) కంటే అతని సగటే మెరుగ్గా ఉంది. ఇక స్పిన్‌కు పెద్దగా సహకరించని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ లాంటి విదేశీ పిచ్‌లపైనా అశ్విన్‌ మంచి ప్రదర్శనే చేశాడు. ఆ నాలుగు దేశాల్లో కలిపి 40.11 సగటుతో 63 వికెట్లు తీసిన అతను.. మొత్తంగా విదేశాల్లో 31 మ్యాచ్‌ల్లో 31.18 సగటుతో 123 వికెట్లు పడగొట్టాడు.

ఇదీ చూడండి: 'కోహ్లీ సారథ్యంలో ఆడాలని కలలు కన్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.