ETV Bharat / sports

ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్​: టాప్​-5లోకి అశ్విన్​ - ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్​: టాప్​5 ఆల్​రౌండర్​గా అశ్విన్​

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో భారత ఆటగాళ్లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. బ్యాట్స్​మెన్ల జాబితాలో రోహిత్​ శర్మ 14వ స్థానంలో నిలువగా, ఆల్​రౌండర్ల జాబితాలో అశ్విన్​ టాప్​-5లో చోటు సంపాదించాడు.

Ashwin jumps to fifth in Test all-rounder rankings, retains seventh spot among bowlers
ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్​: టాప్​5 ఆల్​రౌండర్​గా అశ్విన్​
author img

By

Published : Feb 17, 2021, 3:14 PM IST

Updated : Feb 17, 2021, 3:28 PM IST

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా ఆటగాళ్లు రోహిత్​ శర్మ, రవిచంద్రన్​ అశ్విన్​లు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఇంగ్లాండ్​తో జరిగిన రెండో టెస్టులో భారీ సెంచరీతో కదం తొక్కిన రోహిత్... బ్యాట్స్​మెన్​ జాబితాలో​ తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని 14వ స్థానంలో నిలిచాడు. కాగా, ఈ జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్​ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ కొనసాగుతున్నాడు. విరాట్​ కోహ్లీ తన 5వ స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.

రెండో ఇన్నింగ్స్​లో శతకం కొట్టిన ఆల్​రౌండర్​ అశ్విన్​.. బ్యాట్స్​మెన్​​ జాబితాలో ఏకంగా 14 స్థానాలు మెరుగుపరుచుకుని 81వ స్థానంలో ఉన్నాడు. రెండో టెస్టులో 8 వికెట్లు తీసిన యాష్​.. బౌలర్ల జాబితాలో 7వ స్థానంలో నిలిచాడు. ఇక ఐసీసీ ఆల్​రౌండ్ల లిస్టులో 5వ స్థానం సంపాదించాడు​. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్​ ప్యాట్​ కమిన్స్​ తన మొదటి స్థానాన్ని భద్రపరుచుకున్నాడు. ఆల్​రౌండర్ల లిస్టులో వెస్టిండీస్​ ఆటగాడు జేసన్​ హోల్డర్​ 407 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.

టీమ్​ఇండియా యువ ఆటగాడు రిషభ్​ పంత్​ కెరీర్​లో అత్యుత్తమ ర్యాంక్​ సాధించాడు. బ్యాటింగ్​ జాబితాలో 11వ స్థానాన్ని పొందాడు. ఇక బౌలర్ల జాబితాలో అరంగేట్ర టెస్టులోనే 5 వికెట్ల ఘనత అందుకున్న స్పిన్నర్​ అక్షర్​ పటేల్​ 68వ స్థానంలో, కుల్​దీప్​ యాదవ్​ 50వ స్థానంలో ఉన్నారు.

ఇదీ చదవండి: ఆ సిరీస్​కు బుమ్రా దూరం.. భువీకి ఛాన్స్​!

Last Updated : Feb 17, 2021, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.