ముంబయి టీ20 లీగ్ వేలంలో అర్జున్ తెందూల్కర్‌ను రూ.5 లక్షలకు సొంతం చేసుకుంది ఆకాశ్ టైగర్స్ ముంబయి వెస్టర్న్ సబ్అర్బన్ జట్టు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ వేలంలో నార్త్ ముంబయి పార్టనర్స్ జట్టు సచిన్ తనయుడిని కొనుగోలు చేసింది. కానీ ఓటీఎమ్(ఆపార్చునిటీ టూ మ్యాచ్) ద్వారా ఆకాశ్ టైగర్స్ అర్జున్ను సొంతం చేసుకుంది. మే 14 నుంచి వాంఖడే వేదికగా ఈ లీగ్ జరుగనుంది.
-
The moment Aakash Tigers won the draw of lots for Arjun Tendulkar! 🥳#EkdumMumbai pic.twitter.com/YQXgwutgeF
— T20 Mumbai (@T20Mumbai) May 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">The moment Aakash Tigers won the draw of lots for Arjun Tendulkar! 🥳#EkdumMumbai pic.twitter.com/YQXgwutgeF
— T20 Mumbai (@T20Mumbai) May 4, 2019The moment Aakash Tigers won the draw of lots for Arjun Tendulkar! 🥳#EkdumMumbai pic.twitter.com/YQXgwutgeF
— T20 Mumbai (@T20Mumbai) May 4, 2019
లెఫ్టార్మ్ పేసర్, బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న అర్జున్ కనీస ధర లక్ష రూపాయలు. అనధికారికంగా జరిగిన అండర్-19 టెస్టు మ్యాచ్‌లోనూ అర్జున్ తెందూల్కర్ ఆడాడు. ముంబయి టీ20 లీగ్‌కు సచిన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గమనార్హం.
ఈ సీజన్లో రెండు కొత్త ఫ్రాంచైజీలు వచ్చాయి. ఆకాశ్ టైగర్స్, ఈగల్ ఠానే స్ట్రైకర్స్ జట్లు ఈ సీజన్లో అరంగేట్రం చేయనున్నాయి.
ఏదైనా జట్టులో ఉన్న ఆటగాడిని అంతే మొత్తం చెల్లించి వేరే జట్టు ఆ క్రీడాకారుడిని కొనుక్కోవచ్చు. ఈ విధానంలో రెండు జట్లు.. 5 లక్షలిచ్చి అర్జున్ను సొంతం చేసుకోవడానికి ముందుకొచ్చాయి. కానీ లక్కీ డిప్ ద్వారా సచిన్ తెందూల్కర్ తనయుడిని దక్కించుకుంది ఆకాశ్ టైగర్స్.