ETV Bharat / sports

తూకం వేసి మరీ తింటున్న కెప్టెన్ కోహ్లీ - ఎలక్ట్రానిక్​ మిషన్​లో ఆహారాన్ని తూకం వేస్తోన్న కోహ్లీ

తన భర్త కోహ్లీ, ఇంట్లోని ఆహారాన్ని తూకం వేసి తింటాడని చెప్పుకొచ్చింది హీరోయిన్​ అనుష్క శర్మ. అందుకు సంబంధించిన ఫొటోను ఇన్​స్టాలో పంచుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు, తెగ కామెంట్లు పెడుతున్నారు.

anushka
అనుష్క, కోహ్లీ
author img

By

Published : Jul 8, 2020, 3:23 PM IST

Updated : Jul 8, 2020, 3:39 PM IST

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన హిట్​ జోడీ కోహ్లీ-అనుష్క ఎంతో ఆనందంగా సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే విరాట్ తినడం గురించి ఇటీవలే ఓ క్రేజీ ఫొటోను పంచుకుంది అనుష్క. తూకం వేసి మరీ తింటున్నాడని రాసుకొచ్చింది.

pohaతింటున్న ఫుడ్​కు తూకం వేస్తున్న కోహ్లీ

ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్​ వెయింగ్​ మిషన్​పై పోహాను సరిగ్గా 100 గ్రాముల మోతాదులో ఉండేలా చూసుకుని గిన్నెలో ఉంచాడు కోహ్లీ. దీన్ని చూసిన నెటిజన్లు, నవ్వుతున్న ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.

తమ ఇంటికి అర కిలోమీటరు దూరంలో ఉన్న క్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్.. రుచికరమైన నీర్​​ దోసాను తనకు తెచ్చినట్లు చెప్పాడు. అతడికి ధన్యవాదాలు చెప్పడం సహా పుట్టగొడుగులతో చేసిన బిర్యానీని ఇచ్చినట్లు ఇన్​స్టాలో పోస్ట్ పెట్టాడు.

ఇది చూడండి : అనుష్క సినిమా షూటింగ్​లోనే నిద్రపోయిన కోహ్లీ

Last Updated : Jul 8, 2020, 3:39 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.