తొలి టెస్టులో ఇంగ్లాండ్ సారథి జోరూట్(218) ద్విశతకం సాధించిన అనంతరం ఆ జట్టు మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌కు చురకంటించాడు. ఐదేళ్ల క్రితం ఫ్లింటాఫ్ చేసిన ఓ ట్వీట్‌కు అమితాబ్ ఓ వ్యంగ్యాస్త్రం సంధించిన నేపథ్యంలో ఇప్పుడు సరదాగా ప్రతీకారం తీర్చుకున్నాడు. శనివారం అమితాబ్‌ను గౌరవిస్తూనే ఫ్లింటాఫ్ వినసొంపుగా ఎద్దేవా చేశాడు.
-
Not really , it’s been doing the rounds again and I found it amusing . Hoping @SrBachchan does too 👍🏻 https://t.co/PbS2t9iYpQ
— Andrew Flintoff (@flintoff11) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Not really , it’s been doing the rounds again and I found it amusing . Hoping @SrBachchan does too 👍🏻 https://t.co/PbS2t9iYpQ
— Andrew Flintoff (@flintoff11) February 6, 2021Not really , it’s been doing the rounds again and I found it amusing . Hoping @SrBachchan does too 👍🏻 https://t.co/PbS2t9iYpQ
— Andrew Flintoff (@flintoff11) February 6, 2021
2016 టీ20 ప్రపంచకప్ సందర్భంగా టీమ్‌ఇండియా ఆస్ట్రేలియాను ఓడించి సెమీ ఫైనల్‌కు చేరింది. ఆరోజు విరాట్ కోహ్లీ (82*; 51 బంతుల్లో 9x4, 2x6) కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. దాంతో ఫ్లింటాఫ్.. కోహ్లీ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'అతడు ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు జో రూట్‌లా అద్భుతమైన ఆటగాడిగా మారుతాడు' అని ట్వీట్ చేశాడు. దానికి స్పందించిన అమితాబ్ 'రూట్ ఎవరు?నాకు తెలియదు. అయినా టీమ్ఇండియా అతడిని కూకటివేళ్లతో పెకిలిస్తుంది' అని రిప్లై ఇచ్చారు.
-
With the greatest respect , this aged well 😂 https://t.co/sjhs7HGT1d
— Andrew Flintoff (@flintoff11) February 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">With the greatest respect , this aged well 😂 https://t.co/sjhs7HGT1d
— Andrew Flintoff (@flintoff11) February 6, 2021With the greatest respect , this aged well 😂 https://t.co/sjhs7HGT1d
— Andrew Flintoff (@flintoff11) February 6, 2021
అయితే, ఇంతకాలం దాని గురించి స్పందించని ఫ్లింటాఫ్.. శనివారం రూట్ టీమ్‌ఇండియాపై తన వందో టెస్టులో ద్విశతకం సాధించిన తర్వాత మళ్లీ ఆ పాత ట్వీట్‌ను వెలికి తీశాడు. అమితాబ్ పోస్టును రీట్వీట్ చేస్తూ ఇలా అన్నాడు. 'మీ మీద ఎంతో గౌరవం ఉంది. కానీ, ఈ ట్వీట్ ఇన్నేళ్ల తర్వాత పనికొచ్చింది' అని పేర్కొంటూ బాలీవుడ్ స్టార్‌కు ఫ్లింటాఫ్ చురకంటించాడు.
ఇదీ చూడండి: కుంబ్లే గొప్ప మ్యాచ్ విన్నర్: గంభీర్