ETV Bharat / sports

హిందీ పాటతో దుమ్ములేపిన ఆల్​రౌండర్ రసెల్ - హిందీ పాటను పాడిన రసెల్​

వెస్డిండీస్ స్టార్ ఆల్​రౌండర్ హిందీ పాట పాడుతున్న వీడియోను పోస్ట్ చేసిన కోల్​కతా నైట్​రైడర్స్.. అతడికి 32వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.

Andre Russell Sings Hindi Song, Wows KKR Teammates In Throwback Video.
హిందీ పాటను పాడి దుమ్మురేపుతున్న రసెల్
author img

By

Published : Apr 29, 2020, 7:20 PM IST

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న రసెల్.. నేడు 32వ పుట్టినరోజు జరుపుకొన్నాడు. ఈ సందర్భంగా త్రోబ్యాక్​ వీడియోను పోస్ట్ చేసి శుభాకాంక్షలు చెప్పింది సదరు ఫ్రాంఛైజీ. ఇందులో భాగంగా 'దేశీ బాయ్స్' సినిమాలోని 'సుభా హోనే నా దే' పాట పాడుతూ అలరించాడీ క్రికెటర్. ఇతడు పాడుతుండగా జట్టులోని మిగతా సభ్యులు గెంతులేస్తూ కనిపించారు. ఇది ఇప్పుడు వైరల్​గా మారింది.

2014 నుంచి కేకేఆర్​ తరఫున ఆడుతున్న రసెల్​... గత సీజన్​లో 14 మ్యాచ్​ల్లో 510 పరుగులు చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఐపీఎల్​ 13వ సీజన్​ను​ నిరవధిక వాయిదా వేశారు. ఈ కారణంతో ఆటగాళ్లందరూ ఇళ్లకే పరిమితమై, సోషల్ మీడియాలో అభిమానులతో టచ్​లో ఉంటున్నారు.

దీ చూడండి : 'సెహ్వాగ్ కన్నా అతడు మంచి ప్లేయర్ కానీ బుర్రలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.