టెస్టులో ఇటీవలే 600వ వికెట్ల మార్క్‌ను అందుకుని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు టీమ్ఇండియా సారథి కోహ్లీతో తలపడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది భారత్‌తో జరగబోయే సిరీస్‌లో కోహ్లీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. 2014, 2018లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లను గుర్తుచేసుకున్నాడు. ఈ నాలుగేళ్లలో విరాట్ అసాధారణ ఆటగాడిగా మార్పుచెందాడని అన్నాడు.
"నాణ్యమైన బ్యాట్స్‌మన్(కోహ్లీ)కు బౌలింగ్ చేయడం కష్టం. కానీ అలాంటి పోరునే నేను ఆస్వాదిస్తాను. అప్పుడే మనలోని సామర్థ్యం బయటపడుతుంది. 2014లో అతడిపై నేను పైచేయి సాధించాను. ఆ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌లో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు విరాట్. కానీ 2018లో మాత్రం అతడి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. అసాధారణ ప్రతిభ కనబరిచాడు. సహనం ఉండటం కూడా నేర్చుకున్నాడు. అందుకే కోహ్లీతో ఎప్పుడెప్పుడు మళ్లీ ఆడతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా"
-జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్ పేసర్
ఉపఖండ పిచ్‌లపై టెక్నిక్‌తో బౌలింగ్ చేయడం వల్లే తాను విజయంవంతమైన పేసర్‌గా రాణిస్తున్నట్లు అండర్సన్ తెలిపాడు. ముఖ్యంగా భారత్ పిచ్‌లపై బౌలింగ్ చేయడం తనకెంతో ఇష్టమని వెల్లడించాడు.
ఇది చూడండి సింధు షట్లర్ కావడానికి కారణం ఆ వ్యక్తి!