ఐపీఎల్.. ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసి, ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్పిస్తుందని తెలిపాడు ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. గతేడాది జరిగిన ఈ లీగ్‌లో ఇంగ్లీష్ ఆటగాళ్లు పాల్గొనడం ప్రపంచకప్ సన్నాహకాల్లో ఓ భాగమని వెల్లడించాడు. ఐపీఎల్లో పాల్గొనే అవకాశం కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుపై ఒత్తిడి తెచ్చామని చెప్పాడు.
"గతేడాది ఐపీఎల్లో ఆడటమనేది ఆండ్రూ స్ట్రాస్ ప్లాన్. నేను అతడిపై ఒత్తిడి తెచ్చి లీగ్‌లో పాల్గొనేలా అనుమతి పొందాం. ఎందుకంటే ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. జాతీయ జట్టుకు ఆడినప్పుడు ఆటగాళ్లపై చాలా ఒత్తిడి, అంచనాలు ఉంటాయి. కానీ ఐపీఎల్లో ఆ పరిస్థితులు, అంచనాలు వేరు. లీగ్‌లో ఆడినపుడు అలాంటి ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో తెలుస్తుంది. అలా ఈ లీగ్ ఆటగాళ్లను వారి సౌకర్యాల నుంచి దూరం చేస్తుంది. భారత ఆటగాళ్లకు ప్రాబ్లమ్ ఏమీ లేదనుకుంటా. ఎందుకంటే మేము మా ఆటగాళ్లను పరిణతి చెందిన వారిగా మార్చడానికి ఐపీఎల్‌ను ఓ వేదికగా ఉపయోగించుకుంటున్నాం. "
-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్
గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను బౌండరీ కౌంట్ ద్వారా ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.