అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలపై ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. బంతి మెరుపు కోసం లాలాజలం వినియోగాన్ని నిషేధించినప్పుడు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నాడు. బ్యాట్‌కు, బంతికి మధ్య పోటీ లేకపోతే ప్రేక్షకులకు ఆటపై ఆసక్తి చూపరని వెల్లడించాడు.
లాలాజలం వాడకుండా బంతులేయడం వల్ల, బౌలర్‌కు బంతి అనుకూలంగా ఉండదని స్టార్క్ చెప్పాడు. బ్యాట్స్‌మెన్ ఎక్కువ పరుగులు చేయకుండా నివారించేందుకు బంతికి కొంత మెరుపు కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో లాలాజలాన్ని వాడడం నిషేధించినందుకు.. బంతులకు మెరుపు కోసం షైనింగ్ వాక్స్ వంటి పదార్థాన్ని పూత పూయడానికి అనుమతించాలని ఐసీసీని కోరాడు స్టార్క్. అయితే లాలాజలాన్ని నిషేధించిన ఐసీసీ.. మరే ఇతర పదార్థాలను బంతిపై వాడటానికి ఇష్టపడలేదు.
ఇదీ చూడండి...'టెస్టుల్లో కోహ్లీ లాంటోడు ఉండాల్సిందే'