ETV Bharat / sports

ఐపీఎల్​కు వాళ్లు రాకపోయినా నో ప్రాబ్లమ్: రహానె - Ajinkya Rahane on IPL 2020

బయో బబుల్​ విధానంలో ఐపీఎల్​ నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆటగాళ్లతో పాటు కుటుంబాలు వెళ్లే విషయమై స్పందించాడు క్రికెటర్​ అజింక్యా రహానె. లాక్​డౌన్​లో కుటుంబంతో చాలా ఆనందంగా గడిపానని చెప్పాడు.

Ajinkya Rahane won't mind families not being there at IPL in UAE
'ఐపీఎల్​కు కుటుంబసభ్యులు రాకపోయినా పర్వాలేదు'
author img

By

Published : Aug 2, 2020, 5:36 PM IST

ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​కు క్రికెటర్లు కుటుంబ సభ్యలకు అనుమతి ఇవ్వకపోయినా పర్వాలేదని అభిప్రాయపడ్డాడు బ్యాట్స్​మన్ అజింక్యా రహానె. టోర్నీకి తన భార్య, కూతురు వస్తే బాగుంటుంది కానీ కరోనా వ్యాప్తి కారణంగా బయో బబుల్​ నిబంధనలు విధిస్తే కచ్చితంగా దానిని పాటిస్తామని చెప్పాడు. రాజస్థాన్​ రాయల్స్​ను వీడిన రహానె.. ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగనున్నాడు.

Ajinkya Rahane won't mind families not being there at IPL in UAE
రహానే

"కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఆటగాళ్లతో కలిసి కుటుంబాలు ప్రయాణిస్తే బాగుంటుంది. కానీ భద్రత కూడా చాలా ముఖ్యం. భార్య, పిల్లలే కాదు తోటి జట్టు సభ్యుల ఆరోగ్యం చాలా కీలకం. ప్రస్తుతం దానికే తొలి ప్రాధాన్యం ఆ తర్వాతే క్రికెట్​. లాక్​డౌన్​తో 4-5 నెలలు కుటుంబంతో చాలా ఆనందంగా గడిపాం. కాబట్టి ఆటగాళ్లతో కుటుంబసభ్యులను యూఏఈకి పంపించాలా వద్దా అనేది బీసీసీఐ, ఫ్రాంచైజీల నిర్ణయం"

--అజింక్యా రహానె, దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు

సెప్టెంబర్​ 19 నుంచి నవంబర్​ 8 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్-13 జరగనుంది. భారత్​లో కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అరబ్ దేశంలో ఈ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది బీసీసీఐ.

ఈ ఏడాది దిల్లీ జట్టు తరఫున తొలిసారి ఆడనున్న రహానె.. కొత్త బృందంతో పనిచేయడం సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డాడు. కోచ్​ రికీ పాంటింగ్​ నుంచి చాలా సలహాలు తీసుకోడానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.