ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో 'గులాబీ' ​టెస్ట్​కు అహ్మదాబాద్​ ఆతిథ్యం

వచ్చే ఏడాది ఇంగ్లాండ్​తో జరగనున్న డే అండ్​ నైట్ టెస్ట్​ మ్యాచ్​ అహ్మాదాబాద్​లో నిర్వహిస్తామని తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.

ahmedabab
గంగూలీ
author img

By

Published : Oct 20, 2020, 7:55 PM IST

Updated : Oct 21, 2020, 8:07 AM IST

వచ్చే ఏడాది ఇంగ్లాండ్​తో జరగనున్న డే అండ్ నైట్(గులాబీ బంతి) టెస్టు మ్యాచ్​కు అహ్మదాబాద్​ ఆతిథ్యం ఇస్తుందని తెలిపాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. అయితే దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. భారత్​ ఇంగ్లాండ్​ మధ్య ఐదు టెస్టులు, పరిమిత ఓవర్ల సిరీస్ జరగనుంది.

షెడ్యూల్​ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు​లో ఇంగ్లాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్ టీమ్​ఇండియా ఆడాలి.​ కరోనా వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఒకవేళ అప్పటికీ వైరస్ ఉద్ధృతి తగ్గకపోతే ఈ సిరీస్​ను యూఈఏకి తరలించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పుకార్లకు చెక్​ పెడుతూ గంగూలీ.. ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశాడు.

దీంతోపాటే ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్​ కోసం టీమ్​ఇండియా తుది జట్టు ఆటగాళ్లను ఎంపిక చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతోందని చెప్పాడు.

ఇదీ చూడండి బీచ్​లో సరదాగా గడుపుతోన్న చాహల్​-ధనశ్రీ

Last Updated : Oct 21, 2020, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.