టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ సురేశ్ రైనా.. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు డైరెక్టర్ దిల్బాల్ సింగ్లతో శుక్రవారం సమావేశమయ్యాడు. లోయలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రైనా వారికి ఇటీవలే లేఖ రాశాడు. తద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు వీలు కల్పించినట్లవుతుందని పేర్కొన్నాడు. ఈ విషయంపై చర్చించేందుకు వారితో భేటీ అయ్యాడు.
-
Famed Indian Cricketer Sh Suresh Raina @ImRaina called on DGP J&K Sh Dilbag Singh at PHQ Srinagar and had discussions about a series of plans of J&K Police for encouraging local youth in honing their #sports skills.He volunteered to meet and guide some cricket teams. pic.twitter.com/7HTJjoylBX
— J&K Police (@JmuKmrPolice) September 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Famed Indian Cricketer Sh Suresh Raina @ImRaina called on DGP J&K Sh Dilbag Singh at PHQ Srinagar and had discussions about a series of plans of J&K Police for encouraging local youth in honing their #sports skills.He volunteered to meet and guide some cricket teams. pic.twitter.com/7HTJjoylBX
— J&K Police (@JmuKmrPolice) September 18, 2020Famed Indian Cricketer Sh Suresh Raina @ImRaina called on DGP J&K Sh Dilbag Singh at PHQ Srinagar and had discussions about a series of plans of J&K Police for encouraging local youth in honing their #sports skills.He volunteered to meet and guide some cricket teams. pic.twitter.com/7HTJjoylBX
— J&K Police (@JmuKmrPolice) September 18, 2020
"జమ్ముకశ్మీర్లో క్రీడలను ప్రోత్సహించే దిశగా కృషి చేయడంపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమావేశం జరిగింది. అందుకు ఆయన మద్దతు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి"
సురేశ్ రైనా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఈ సందర్భంగా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు జమ్ముకశ్మీర్ పోలీసులు, రైనాకు మెమొంటో అందజేశారు. వన్డేల్లో 5,615 పరుగులు చేసిన ఇతడు.. టెస్టుల్లో 768 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్లో కోహ్లీ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా రైనా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి తిరిగొచ్చేశాడు.