కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లోని జమైకా తల్లవాస్ జట్టు కోచ్ శర్వాణ్‌పై, విధ్వంసక గేల్ ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే.. ఆల్‌రౌండర్ రసెల్ ఇదే విషయమై మాట్లాడాడు. ఆ జట్టు తీరుతో విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
"జమైకా తల్లవాస్ ఓ విచిత్రమైన జట్టు. మేనేజ్మెంట్ తీరుతో విసిగిపోయా. నేను ఆరోపణలు ఊరికే చేయడం లేదు. ఆ జట్టుతో కొన్నాళ్లపాటు కొనసాగడం, వారి ఆలోచన ధోరణిని దగ్గర నుంచి పరిశీలించడం వల్లే చెబుతున్నా. తల్లవాస్ తరఫున ఆడటం కంటే ఊరుకోవడం ఉత్తమం. యాజమాన్యం తీరు మారకపోతే జట్టు మనుగడ కష్టమే" -ఆండ్రీ రసెల్, వెస్టిండీస్ ఆల్‌రౌండర్
అంతకు ముందు మాట్లాడిన గేల్.. ఒకప్పటి తన సహచరుడు రామ్‌నరేశ్ శర్వాణ్, కరోనా కన్నా ప్రమాదకారి అని అన్నాడు. అతడి కుట్ర వల్లే తల్లవాస్‌లో స్థానం కోల్పోయానని చెప్పాడు.