పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం ఇంగ్లాండ్ వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు దేశవాళీ మ్యాచ్ల్లో తప్పకుండా ఆడాల్సిందేనని నిర్ణయించింది.
"మహ్మద్ ఆమిర్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ దేశవాళీ మ్యాచ్ల్లో ఆడాల్సి ఉంటుంది. జాతీయ జట్టులో ఎంపిక కావాలంటే ఇక్కడ(పాక్) జరిగే దేశవాళీ టీ 20, వన్డేల్లో సత్తాచాటాలి. ఈ విధానం ద్వారే జాతీయ జట్టులోకి క్రికెటర్లను ఎంపిక చేస్తాం". -పీసీబీ ప్రతినిధి
ఆమిర్ భార్య నర్జీస్ బ్రిటన్ పౌరురాలు. ఈ మేరకు యూకేకు వెళ్లి అక్కడి నుంచి ఐపీఎల్లో ఆడేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్లో పరాభవం తర్వాత పాక్ ప్రధాని ఇమ్రన్ఖానే రంగంలోకి దిగారు. దేశవాళీ మ్యాచ్ల నుంచి మొదలు జట్టులో క్రియాశీలక మార్పులు చేయనున్నారు.
ఇది చదవండి: పులిబిడ్డకు బారసాల.. హిమాదాస్గా నామకరణం!