పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ తన బ్యాట్‌ను వేలంలో కొన్నాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ వెల్లడించాడు. కరోనాపై పోరాటంలో విరాళాలు సేకరించడానికి 2013లో శ్రీలంకపై డబుల్‌సెంచరీ చేసిన బ్యాట్‌ను వేలానికి ఉంచాడు రహీమ్. దాన్ని 20 వేల యూఎస్ డాలర్లు పెట్టి సొంతం చేసుకున్నాడు అఫ్రిదీ. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
"తన ఫౌండేషన్‌లో ఉంచడం కోసం షాహిద్ అఫ్రిదీ నా బ్యాట్‌ను కొన్నాడు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. గతవారం బ్యాట్‌ను అమ్మడానికి పెట్టా. కానీ కొంతమంది మోసగాళ్ల వల్ల రద్దు చేశాము. ఈ విషయం తెలుసుకున్న అఫ్రిదీ తానే స్వయంగా బ్యాట్‌ను కొంటానని మే 13న ఒక లెటర్ రాశాడు. దాని కోసం 20 వేల యూఎస్ డాలర్లు ( బంగ్లాదేశ్ కరెన్సీ ప్రకారం 16.8 లక్షల రూపాయలు) వెచ్చించాడు".
-ముష్ఫికర్ రహీమ్, బంగ్లాదేశ్ వికెట్ కీపర్
అఫ్రిదీకి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశాడు ముష్ఫికర్. నిజమైన హీరోలు ఇలాంటి సమయంలోనే బయటకు వస్తారని.. ఈ సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుదామని వీడియోలో అఫ్రిదీ తెలిపాడు.
-
Thanks for your support brother ✊✊✊ pic.twitter.com/QeLiJBx0nY
— Mushfiqur Rahim (@mushfiqur15) May 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thanks for your support brother ✊✊✊ pic.twitter.com/QeLiJBx0nY
— Mushfiqur Rahim (@mushfiqur15) May 15, 2020Thanks for your support brother ✊✊✊ pic.twitter.com/QeLiJBx0nY
— Mushfiqur Rahim (@mushfiqur15) May 15, 2020
క్రికెటర్లందరూ తమకు సంబంధించిన వాటిని వేలంవేసి వాటి ద్వారా వచ్చిన నిధులను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఇటీవలే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కలిసి గుజరాత్ లయన్స్‌పై ఆడిన క్రికెట్ కిట్‌ను వేలం వేశారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జాస్ బట్లర్.. తన ప్రపంచకప్ జెర్సీని వేలానికి వేశాడు.
ఇదీ చూడండి.. కచ్చితంగా ఆ రెండు రికార్డులు నావే: జకోవిచ్