ETV Bharat / sports

'ద్రవిడ్​ అడుగుజాడల్లో పాక్​ మాజీలు నడవాలి'

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్ అడుగుజాడల్లో పాక్​ దిగ్గజాలు నడవాలని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ సారథి షాహిద్​ అఫ్రిది. అప్పుడే పాక్​ క్రికెట్​ భవిష్యత్తు​ మెరుగ్గా తయారవుతుందని అన్నాడు.

afridi
అఫ్రిది
author img

By

Published : Jan 17, 2021, 9:58 AM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ అడుగుజాడల్లో నడవాలని పాక్​ మాజీ ఆటగాళ్లకు సూచించాడు ఆ దేశ మాజీ సారథి షాహిద్​ అఫ్రిది. నైపుణ్యం ఉన్న యువ ఆటగాళ్లను గుర్తించి.. వారిని మెరికల్లా తీర్చదిద్దడం కోసం ద్రవిడ్​ తీవ్రంగా శ్రమించాడని కొనియాడాడు. భారత జట్టుకు ఎందరో ప్రతిభావంతమైన ఆటగాళ్లను అందించాడని.. ఇదే రీతిలో తమ దేశ మాజీ దిగ్గజ ఆటగాళ్లు కూడా యువ క్రికెటర్లలో ప్రతిభను గుర్తించి వారిని సరైన రీతిలో శిక్షణ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

"పాక్​.. ప్రతిభ, సామర్థ్యం ఉన్న ఆటగాళ్ల కొరతను ఎదుర్కొంటుందని నా అభిప్రాయం. కాబట్టి మా మాజీలు భవిష్యతులో రాబోయే యువ క్రికెటర్లకు సరైన రీతిలో మార్గనిర్దేశం చేసి ఎదిగేలా చూడాలి. అప్పుడే ఈ సమస్యను అధిగమించగలం. నేను ఆడేటప్పుడు కూడా కోచ్​ల వల్ల బౌలర్లు సమస్యలను ఎదుర్కొనేవాళ్లు. కాబట్టి పీసీబీ నా వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని సూచన."

- షాహిద్​ అఫ్రిది, పాక్​ మాజీ సారథి.

భారత మాజీ క్రికెటర్​ ​ద్రవిడ్.. భారత్-ఏ, అండర్-19 జట్ల కోచ్‌గా ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే యువ ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించి మెరుగ్గా తీర్చిదిద్దటంలో పాక్​ మాజీలు ఇంజమామ్​​ ఉల్​ హక్​, యూనిస్​ ఖాన్​, మహ్మద్​ యూసుఫ్ సరైనోళ్లని అభిప్రాయపడ్డాడు అఫ్రిది.

ఇదీ చూడండి : 14 ఏళ్ల తర్వాత.. పాక్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.