ETV Bharat / sports

బంగ్లాదేశ్​పై అఫ్గాన్​ సంచలన విజయం - అంతర్జాతీయ టెస్టు క్రికెట్​లో అఫ్గాన్​ సంచలన విజయం

అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే అంతర్జాతీయ క్రికెట్​లో అఫ్గాన్​ జట్టు సంచలనాలు సృష్టిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్​లో పెద్ద జట్లకే గట్టిపోటీనిచ్చిన ఈ పసికూన... మరోసారి తనకన్నా మెరుగైన బంగ్లాదేశ్​కు షాకిచ్చింది. ఇరుజట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్​ మ్యాచ్​లో 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బంగ్లాపై అఫ్గాన్​ సంచలన విజయం
author img

By

Published : Sep 10, 2019, 8:42 AM IST

Updated : Sep 30, 2019, 2:19 AM IST

ప్రపంచ క్రికెట్లో అఫ్గానిస్థాన్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్​లో సంచలనాలు సృష్టిస్తోన్న ఈ జట్టు... ఇప్పుడు టెస్టుల్లోనూ అదరగొట్టింది. తనకన్నా మెరుగైన బంగ్లా జట్టును ఓడించింది. బంగ్లాలోని చట్టోగ్రామ్​లో ముగిసిన ఏకైక టెస్టు మ్యాచ్​లో 224 పరుగుల తేడాతో గెలిచింది. సుదీర్ఘ మ్యాచ్​లకు తొలిసారి కెప్టెన్​ బాధ్యతలు చేపట్టిన యువ సంచలనం రషీద్​ఖాన్​ బ్యాట్​తోనూ బంతితోనూ రాణించాడు. ఫలితంగా 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ అందుకున్నాడు. అయితే అవార్డును రిటైర్మెంట్​ ప్రకటించిన ఆ దేశ సీనియర్​ ఆటగాడు నబీకి అంకితం చేశాడు.

అఫ్గాన్​ ఇచ్చిన 398 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లా.. రెండో ఇన్నింగ్స్​లో 173 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్​కు వరుణుకు కాస్త అంతరాయం కలిగించాడు.

డ్రా అనుకుంటే...

వర్షం వల్ల చివరి రోజైన సోమవారం రెండు సెషన్లలో ఆట సాగలేదు. ఆఖరి సెషన్​లో కాస్త తెరిపినిచ్చాడు వరుణుడు. అప్పటికి 18.3 ఓవర్ల ఆటే మిగిలుండగా.. బంగ్లాదేశ్​ చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. షకిబ్​తో పాటు సౌమ్య సర్కార్​ క్రీజులో ఉండటం వల్ల మ్యాచ్​ డ్రాగా ముగిసేలా కనిపించింది. అయితే ఆఖర్లో మూడు కీలక వికెట్లు తీసి జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు రషీద్​ఖాన్​.

రషీద్ పాంచ్​​ పటాకా...

ఏకైక టెస్టు 5 రోజుల ఆటలో మొత్తం 11 వికెట్లు తీశాడు రషీద్​ ఖాన్​. రెండు ఇన్నింగ్స్​ల్లో ఐదేసి వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్​గా తొలి టెస్టులో పది వికెట్లు పడగొట్టడమే కాకుండా 50 పరుగులు(తొలి ఇన్నింగ్స్​లో) చేసిన తొలి క్రికెటర్​గా రషీద్​ రికార్డు సృష్టించాడు. పిన్న వయులోనే టెస్టు మ్యాచ్​ గెలిపించిన కెప్టెన్​గానూ చరిత్రకెక్కాడు.

  • 🔥 Youngest captain to win a Test
    🔥 Picked up 11 wickets in the match
    🔥 Scored a half-century too

    What a star, Rashid Khan, who is Player of the Match! pic.twitter.com/9P0jOM1not

    — ICC (@ICC) September 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తొలి ఇన్నింగ్స్​లో అఫ్గాన్​ 342 పరుగులు చేయగా.. బంగ్లా 205 పరుగులకు ఆలౌటైంది. అఫ్గాన్​కిది మూడో టెస్టు మాత్రమే. గతేడాతి అరంగేట్ర మ్యాచ్​లో భారత్​ చేతిలో కంగుతింది. తర్వాత ఐర్లాండ్​పై ఘనవిజయం నమోదు చేసింది.

ఇదీ చదవండి...

అఫ్గాన్​ యువ సంచలనం రషీద్​ఖాన్​ రికార్డుల మోత

Reykjavik (Iceland), Sep 10 (ANI): President Ram Nath Kovind met and greeted Indian community in Iceland's Reykjavik. He also clicked pictures with them. President Kovind addressed Indian Diaspora there and said, "I am happy to be here in Reykjavik. I would like to thank you for the very special and warm welcome, it's a 2nd visit of an Indian President to Iceland, the 1st time an Indian President visited Iceland was in 2005, and I'm happy to be here."

Last Updated : Sep 30, 2019, 2:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.