టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ చెతేశ్వర్ పుజారా మరో ఘనత సాధించాడు. గత పదేళ్లలో ఆస్ట్రేలియాపై ఎక్కువ బంతులు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 28 ఇన్నింగ్స్‌ల్లో 3,609బంతులను ఎదుర్కొన్నాడు. గురువారం అడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఈ మార్క్‌ను అందుకున్నాడు.
ఫలితంగా ఇంగ్లాండ్ సారథి జో రూట్( 28 ఇన్నింగ్స్‌ల్లో 3,607), ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ కుక్(40ఇన్నింగ్స్‌ల్లో 3,274), టీమ్ఇండియా సారథి కోహ్లీ(35ఇన్నింగ్స్‌ల్లో 3,115) బంతుల రికార్డును అధిగమించాడు పుజారా.
గురువారం ఆసీస్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా 43 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఇదీ చూడండి : పుజారాపై వార్న్ వివక్షపూరిత వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్