భారత క్రికెట్ జట్టుపై దాడి చేస్తామంటూ వచ్చిన ఓ మెయిల్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కంగారుపెట్టింది. ఈ మెయిల్‌ను వెంటనే ఐసీసీకి పంపింపి పీసీబీ. బీసీసీఐకి ఓ కాపీ వచ్చింది. ఈ విషయంపై భారత క్రికెట్ బోర్డు అధికారి స్పందిస్తూ.. అది నకిలీ మెయిల్ అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అక్కడ జట్టుపై దాడికి పాల్పడతామంటూ పీసీబీకి మెయిల్ వచ్చింది. బీసీసీఐకి సమాచారం అందిన వెంటనే ఈ విషయంపై హోంశాఖను సంప్రదించింది. ఆంటిగ్వాలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. చివరకు అది ఫేక్ మెయిల్ అని తేల్చింది.
"హోంశాఖకు సమాచారం అందించాం. ఆంటిగ్వాలోని ఇండియన్ ఎంబసీకి విషయం తెలిపాం. ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశాం. వెస్టిండీస్‌లో ఉన్న భారత ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం లేదు. అది ఒక నకిలీ మెయిల్. భద్రతను మరింత పెంచుతాం".
- బీసీసీఐ అధికారి
ఇవీ చూడండి.. ఆర్చర్ తీరుపై షోయబ్ అక్తర్ మండిపా
టు