ETV Bharat / sports

'మిస్టర్​ 360' క్రీజులో ఉంటే ప్రత్యర్థికి వణుకే! - ఏబీ డివీలియర్స్ బర్త్​డే

అబ్రహం బెంజమిన్‌ డివిలియర్స్‌.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ 'మిస్టర్​ 360', 'ఏబీడీ' అంటే క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఇట్టే పసిగట్టేస్తుందే. ఓవైపు బ్యాట్​ను మంత్రదండం చేసుకుని బ్యాటింగ్​లో విధ్వంసం సృష్టిస్తాడు. మరోవైపు ఫీల్డింగ్​లోనూ స్పైడర్​ మ్యాన్​ను తలపించేలా మైదానాన్ని చుట్టేస్తుంటాడు. అందుకే ఏబీడీ ఆటతీరుకు క్రికెట్​ అభిమానులు పరవశించిపోయి ముద్దుగా 'మిస్టర్​ 360' అని పేరు పెట్టేసుకున్నారు. ఆధునిక క్రికెట్​కు వన్నె తెచ్చిన ఈ క్రికెటర్​.. నేటి(బుధవారం)తో 37 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.

ab de villiers birthday special story
భారతీయుల అభిమానం చూరగొన్న 'మిస్టర్​ 360'
author img

By

Published : Feb 17, 2021, 11:59 AM IST

Updated : Feb 17, 2021, 1:16 PM IST

అది 2015.. బెంగళూరులో భారత్​-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు జరుగుతోంది. క్రీజులోకి ఓ బ్యాట్స్‌మన్ వచ్చాడు. స్టేడియంలోని అభిమానులంతా అతడికి నీరాజనాలు పలుకుతున్నారు. అతడు భారతీయుడు కాదు. అయినా అతడికి బ్రహ్మరథం పడుతున్నారు. అతడు ఫోర్‌ బాదినా.. బ్యాటు పైకెత్తినా.. ఏబీడీ ఏబీడీ.. అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. ఇప్పటికే అర్థమై ఉంటుంది అతడు ఎవరో కాదు ఏబీ డివిలియర్స్ అని‌. సొంత జట్టును కాదని భారత అభిమానులంతా అతడిని ఆదరించిన తీరుని చూస్తే.. అది కేప్​టౌనా? లేక బెంగళూరా? అనే సందేహాలు ఎవరికైనా కలుగుతాయంటే అతియోశక్తి కాదు! అంతలా భారతీయుల అభిమానాన్ని సంపాదించుకున్న 'మిస్టర్​ 360' నేటితో 37 సంవత్సరాలు పూర్తిచేసుకున్నాడు.

ab de villiers birthday special story
ఏబీ డివిలియర్స్​

2004లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టాడు ఏబీ. దక్షిణాఫ్రికా తరఫున అతడు 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 8,765, వన్డేల్లో 9,577, టీ20ల్లో 1,672 పరుగులు బాదాడు.

భారత్​ రెండో ఇల్లు..

దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగ్రేటం చేసిన డివిలియర్స్‌.. నాలుగో సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు వెళ్లాడు. ఇప్పటికీ అతడు ఆర్‌సీబీ జట్టులోనే ఉన్నాడు. అందుకే బెంగళూరు అతడికి రెండో ఇల్లు అయ్యింది. ప్రపంచక్రికెట్‌ చరిత్రలో సచిన్‌ తెందుల్కర్‌, డివిలియర్స్‌ లాంటి కొద్ది మంది మాత్రమే దేశ సరిహద్దులు చెరిపి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.

ab de villiers birthday special story
ఏబీ డివీలియర్స్​, విరాట్ కోహ్లీ

విరాట్​కు మంచి జోడీ..

బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీతో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇద్దరూ కలిసి ఐదుసార్లు 100 పరుగులు.. రెండుసార్లు 200 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ప్రపంచంలో మరే జోడీ ఈ రికార్డును ఇప్పటివరకు చేరుకోలేదు.

డివిలియర్స్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 141 మ్యాచ్‌లాడి 39.33 సగటుతో 3,953 పరుగులు నమోదు చేశాడు. అందులో 3 శతకాలు, 28 అర్ధశతకాలు ఉండగా 151 స్ట్రైక్‌రేట్‌తో 326 ఫోర్లు, 186 సిక్సర్లు బాదాడు. వ్యక్తిగతంగా అత్యధికంగా 133 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ab de villiers birthday special story
ఏబీ డివీలియర్స్​

రీఎంట్రీపై ఎదురుచూపులు!

మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అనూహ్యంగా 2018, మే 23న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఈ ఏడాది టీ20 ప్రపంచేకప్​ జట్టులో ఇతడికి చోటు దక్కే అవకాశాలున్నాయి.

Last Updated : Feb 17, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.