ETV Bharat / sports

టిక్​టాక్ చేసేందుకు తెగ కష్టపడ్డ ఆసీస్ క్రికెటర్ - Aaron Finch Dancing Attempt news

వార్నర్​లా టిక్​టాక్ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు ఆసీస్ ఓపెనర్ ఫించ్. ఆ వీడియోను ఇన్​స్టాలో పంచుకోగా, దానిని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

టిక్​టాక్ చేసేందుకు తెగ కష్టపడ్డ ఆసీస్ క్రికెటర్
ఆసీస్ ఓపెనర్ ఫించ్
author img

By

Published : May 5, 2020, 5:00 PM IST

లాక్​డౌన్​తో మ్యాచ్​లు నిలిచిపోవడం వల్ల ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, టిక్​టాక్​ వీడియోలు చేస్తూ అదరగొడుతున్నాడు. ఇతడిలానే టిక్​టాక్ చేసిన సహచర క్రికెటర్ ఫించ్.. డ్యాన్స్​ చేసేందుకు తెగ కష్టపడ్డాడు. ఒకానొక దశలో ఏం చేయాలో తెలియక బిక్కమొహం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్​స్టాలో పంచుకున్నాడు. దీనిని చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు.

తన వయసు 30 దాటిపోవడం వల్ల డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పాడు ఫించ్. వార్నర్ మాత్రం​ పెద్దవాడైనా డ్యాన్స్ ఇరగదీస్తున్నాడని రాసుకొచ్చాడు. అతడిలా చేద్దామంటే కుదరడం లేదని అన్నాడు. అయితే డ్యాన్స్ కంటే క్రికెట్ బాగుందని తెలిపాడు.

ఆసీస్ తరఫున 126 వన్డేలాడిన ఫించ్.. 4882 పరుగులు చేశాడు. 61 టీ20ల్లో 1989 పరుగులు సాధించాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.