ETV Bharat / sports

'వాళ్లు నన్ను 'పాకీ' అని పిలిచారు' - ఇంగ్లాండ్​లో జాతివివక్షను ఎదుర్కొన్న ఆకాశ్​ చోప్రా

తాను ఓసారి జాతివివక్షను ఎదుర్కొన్నానని చెప్పాడు మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. ఇంగ్లాండ్​లో మ్యాచ్​ జరుగుతుండగా, ఇద్దరు సఫారీ ఆటగాళ్లు తనను పాకీ అని పిలిచినట్లు వెల్లడించాడు.

Aakash Chopra alleges racial abuse during league cricket game in England
వాళ్లు నన్ను 'పాకి' అని దూషించారు: ఆకాశ్​ చోప్రా
author img

By

Published : Jun 11, 2020, 8:47 AM IST

తాను ఆడుతున్న సమయంలో ఓసారి జాతివివక్షను ఎదుర్కొన్నానని టీమ్​ఇండియా మాజీ బ్యాట్స్​మన్​ ఆకాశ్​ చోప్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇంగ్లాండ్​లో జరిగిన లీగ్​ మ్యాచ్​లో ఇద్దరు దక్షిణాఫ్రికా క్రికెటర్లు తనను దూషించారని చెప్పుకొచ్చాడు.

"ఒకానొక సమయంలో మేమూ (క్రికెటర్లు) జాతివివక్షకు ఎదుర్కొన్నాం. ఇంగ్లాండ్​ క్రికెట్ లీగ్​ ఆడుతున్నప్పుడు ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, నాన్​ స్ట్రైకింగ్​లో ఉన్న నన్ను 'పాకీ' అని పిలిచారు. ఆ క్షణం నాకిప్పటికీ గుర్తుంది. పాకీ అంటే పాకిస్థాన్​కు షార్ట్​ఫామ్​ అని మీరంతా అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. ఓ జాతిని దూషించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఆ సమయంలో జట్టు నాకు మద్దతుగా నిలిచింది"

- ఆకాశ్​ చోప్రా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

2003-2004 మధ్య భారత్​ తరపున 10 టెస్టులు ఆడిన ఆకాశ్​ చోప్రా.. ప్రపంచవ్యాప్తంగా జాతివివక్ష అనేది ఉందని అన్నాడు. భారత్​లో ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్న ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ సైమండ్స్​ను దీనికి ఉదాహరణగా తీసుకోవచ్చని తెలిపాడు.

ఇదీ చూడండి... 'యువరాజ్​' అభిమానులకు ట్విట్టర్​లో షాక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.