ETV Bharat / sports

సర్జరీ తర్వాత అభిమానుల ముందుకు కపిల్ దేవ్ - Kapil Dev new

ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న కపిల్​దేవ్.. అభిమానుల్ని వీడియో ద్వారా పలకరించారు. తాను బాగానే ఉన్నట్లు చెప్పారు. తన సహచర క్రికెటర్లను త్వరలో కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

A beaming Kapil Dev says 'feeling good' in video post angioplasty
సర్జరీ తర్వాత అభిమానుల ముందుకు కపిల్ దేవ్
author img

By

Published : Oct 29, 2020, 4:47 PM IST

దిగ్గజ క్రికెటర్ కపిల్​ దేవ్.. అభిమానుల్ని పలకరించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, '1983 ప్రపంచకప్' సభ్యుల్ని కలవాలని అనుకుంటున్నట్లు వీడియోలో చెప్పారు.

కపిల్​కు గత గురవారం గుండెపోటు రావడం వల్ల యాంజియోప్లాస్టీ చేశారు. అనంతరం ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఓ వీడియోను పోస్ట్ చేశారు.

"మై ఫ్యామిలీ 83.. నేను మిమ్మల్ని త్వరగా కలవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను. నేను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సినిమా విడదుల ఎప్పుడో తెలియదు కానీ నేను మాత్రం మీ అందర్ని కలవాలనుకుంటున్నాను. ఈ ఏడాది చివరికి వచ్చేశాం. వచ్చే ఏడాది బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను" -వీడియోలో కపిల్​దేవ్

టీమ్​ఇండియాకు 16 ఏళ్లపాటు ఆల్​రౌండర్​గా సేవలందించిన కపిల్ దేవ్.. ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు. ఈయన క్రికెట్ కెరీర్​లో 131 టెస్టులు, 225 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 5000 పరుగులు చేయడం సహా 400కు పైగా వికెట్లు తీశారు. ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గా నిలిచారు.

కపిల్ బయోపిక్ '83'.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రణ్​వీర్ సింగ్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. కరోనా ప్రభావంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

1983 world cup
1983 ప్రపంచకప్​తో భారత జట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.