ETV Bharat / sports

వర్చువల్​గా జాతీయ క్రీడా పురస్కార వేడుకకు అంతా సిద్ధం - dhyanchand award latest news

దేశంలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే 2020 జాతీయ క్రీడా పురస్కార వేడుకను వర్చువల్​ పద్దతిలో నిర్వహించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆన్​లైన్​ ద్వారా విజేతలకు పతకాలను అందజేయనున్నారు.

2020 National Sports Awards
జాతీయ క్రీడా పరస్కారాలు
author img

By

Published : Aug 28, 2020, 9:59 AM IST

ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కార ప్రదానోత్సవం తొలిసారి వర్చువల్​ పద్ధతిలో జరగనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29న హాకీ దిగ్గజం ధ్యాన్​ చంద్ జయంతి సందర్భంగా జరిపే ఈ వేడుకలో.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆన్​లైన్​ ద్వారా విజేతలకు పతకాలను అందజేయనున్నారు. తన నివాసం నుంచి ఎన్​ఐసీ లింక్​ ద్వారా రాష్ట్రపతి కార్యక్రమానికి హాజరు కానుండగా.. అవార్డు గ్రహీతలంతా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని సాయ్​, ఎన్​ఐసీ కేంద్రాల నుంచి పాల్గొననున్నారు. అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్​ రిజిజు సహా ఇతర ప్రముఖులు కూడా భాగం కానున్నారు.

ఈసారి మొత్తం ఏడు విభాగాలకుగానూ 74 మంది అవార్డులు దక్కించుకోనున్నారు. వారిలో 65 మంది కార్యక్రమానికి వర్చువల్ పద్ధతిలో హాజరుకానుండగా.. క్వారంటైన్​, కరోనా పాజిటివ్​, అనారోగ్యం, విదేశాల్లో ఉండటం వంటి కారణాల వల్ల మిగిలిన 9 మంది పాల్గొనట్లేదు.

2020 National Sports Awards
అవార్డుకు ఎంపికైన క్రీడాకారులు

అవార్డు గ్రహీతలు హాజరయ్యే వేదికల్లో నిబంధనల ప్రకారం అన్ని ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించనున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ముందు ప్రతి క్రీడాకారుడు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

అవార్డు గ్రహీతలు వీరే..

ఈ ఏడాది స్టార్​ క్రికెటర్​ రోహిత్​ శర్మ భారత అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్​ గాంధీ ఖేల్​రత్నకు ఎంపికయ్యాడు. అతనితో పాటు పారా అథ్లెట్​ మరియప్పన్​ తంగవేలు, టేబుల్​ టెన్నిస్​ ఛాంపియన్​ మనిక బత్రా, రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​, మహిళల హాకీ జట్టు కెప్టెన్​ రాణి రాంపాల్​ ఈ అవార్డును అందుకోనున్నారు.

క్రికెటర్లు ఇషాంత్​ శర్మ, దీప్తి శర్మ, అథ్లెట్​ ద్యుతి చంద్​, షూటర్​ మను బాకర్​ సహా 27 మంది క్రీడాకారులు అర్జున అవార్డు సొంతం చేసుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.