సరిగ్గా 18 ఏళ్ల క్రితం జరిగిన నాట్‌వెస్ట్ ఫైనల్‌ను గుర్తు చేసుకున్నాడు భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. ఆ మ్యాచ్ తన జీవితాన్నే మార్చేసిందని, ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పాడు. అందుకే 2018లో అదే తేదీన రిటైర్మెంట్ ప్రకటించినట్లు వెల్లడించాడు. 2002 జులై 13న లార్డ్స్‌లో జరిగిన తుదిపోరులో ఇంగ్లాండ్‌పై భారత్ అద్భుత విజయం సాధించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"జులై 13కూ నాకు దగ్గర అనుబంధం ఉంటుంది. నా జీవితాన్నే మార్చేసిన ఆ తేదీని ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే 2018లో అదే రోజున రిటైర్మెంట్ ప్రకటించాను. 2002 నాట్‌వెస్ట్ ఫైనల్లో నేను ఎదుర్కొన్న అనుభవాన్ని అప్పటివరకు ఎదుర్కోలేదు. తుది పోరులో ఇంగ్లాండ్‌పై గెలిచేందుకు ఎన్నో ప్రణాళికలు వేయడం సహా చర్చలు జరిపాం. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓడిపోతామని భావించినా చివరకు విజేతగా నిలిచాం"
-మహ్మద్ కైఫ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
ఈ ఫైనల్లో 326 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఇన్నింగ్స్‌ను అద్భుతంగానే ఆరంభించింది. అనంతరం పుంజుకున్న ఇంగ్లాండ్ బౌలర్లు 146 పరుగులకే 5 కీలక వికెట్లు పడగొట్టి పైచేయి సాధించారు. దీంతో జట్టు కష్టాల్లోకి వెళ్లింది. ఆ సమయంలో యువరాజ్-కైఫ్ కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 69 పరుగులు చేసి యువీ ఔటైనప్పటికీ.. కైఫ్ మాత్రం చెలరేగి ఆడాడు. ఫలితంగా రెండు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గంగూలీ చొక్కా విప్పిన వేళ
ఈ నాట్‌వెస్ట్ సిరీస్‌లో టీమ్ఇండియాకు సారథిగా వ్యవహరించాడు సౌరభ్ గంగూలీ. తుది పోరులో భారత్ విజయం సాధించగానే పట్టలేని ఆనందంతో చొక్కా విప్పిన దాదా.. దానిని గాల్లోకి తిప్పుతూ చేసిన సందడినీ ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు.
ఇది చూడండి : 'సూపర్‌హీరో' దుస్తులతో జూనియర్ ధావన్ వంట