ETV Bharat / sports

రికార్డ్​ అలర్ట్​: మిథాలీ పది వేల పరుగులు - పదివేల రన్స్​ చేసిన తొలి మహిళ​గా మిథాలీ కొత్త ఫీట్

అంతర్జాతీయ మహిళల క్రికెట్లో టీమ్ఇండియా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్​ కొత్త రికార్డు సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్​ఉమెన్​గా నిలిచింది. ఈమె కంటే ముందు ఇంగ్లాండ్​ క్రికెటర్ ఛార్లెట్​ ఎడ్వర్డ్స్​ ఈ ఘనత సాధించింది.

10,000 runs and counting for the legendary Mithali Raj
పదివేల రన్స్​ చేసిన తొలి మహిళ​గా మిథాలీ కొత్త ఫీట్
author img

By

Published : Mar 12, 2021, 11:30 AM IST

Updated : Mar 12, 2021, 12:08 PM IST

భారత మహిళా వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్​ కొత్త ఫీట్ సాధించింది. అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్​ఉమెన్​గా రికార్డు సృష్టించింది. ఈమెకంటే ముందు ఇంగ్లాండ్​ క్రికెటర్ ఛార్లెట్​ ఎడ్వర్డ్స్​ ఈ ఘనత సాధించింది.

మిథాలీ రాజ్​ సాధించిన ఘనతకు గానూ బీసీసీఐ ట్విట్టర్​ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 'వాట్​ ఏ ఛాంపియన్​! పది వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాట్స్​ఉమెన్​ మిథాలీ' అంటూ ట్వీట్​ చేసింది.

ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో భాగంగా మిథాలీ ఈ మైలురాయిని అందుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్​ అన్నె బోస్క్​ వేసిన 28వ ఓవర్లో బౌండరీ సాధించిన ఈ వెటరన్​ బ్యాట్స్​ఉమెన్​.. ఈ అరుదైన రికార్డును సాధించింది. ఈ మ్యాచ్​లో 50 బంతుల్లో 36 పరుగులు చేసిన మిథాలీ.. రికార్డు సాధించిన తర్వాతి బంతికే పెవిలియన్​ చేరింది.

భారత్​ తరఫున 10 టెస్టు మ్యాచ్​లాడిన మిథాలీ.. 663 పరుగులు సాధించింది. 212 వన్డేలతో పాటు 89 టీ20ల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. పరిమిత ఓవర్ల క్రికెట్​లో వరుసగా 6938, 2364 రన్స్​తో ఉంది.

ఇదీ చదవండి: మార్చి 16న ఆసియన్ ఒలింపిక్​​ క్వాలిఫయర్​ ట్రయల్స్​

Last Updated : Mar 12, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.