ETV Bharat / sports

'స్టెయిన్​ నువ్వో నిప్పు.. నీలాంటోడు దొరకడు'

దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్(dale steyn retirement) క్రికెట్​కు రిటైర్మెంట్ పలికాడు. ఈ నేపథ్యంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రశంసలు కురిపించారు పలువురు దిగ్గజ క్రికెటర్లు.

author img

By

Published : Aug 31, 2021, 7:09 PM IST

Updated : Aug 31, 2021, 7:52 PM IST

steyn
స్టెయిన్​

దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌(dale steyn retirement) మంగళవారం (ఆగస్టు 31) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2004లో ఇంగ్లాండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన అతడు 2020లో ఆస్ట్రేలియాపై చివరి అంతర్జాతీయ టీ20 ఆడాడు. అయితే, రెండు మూడేళ్లుగా గాయాలబారిన పడటం వల్ల స్టెయిన్‌ పెద్దగా మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే ఇవాళ రిటైర్మెంట్‌ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

"ట్రైనింగ్, మ్యాచ్​లు, ట్రావెల్, విజయాలు, ఓటములు, గాయాలతో 20 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలో అద్భుత జ్ఞాపకాలు సంపాదించా. చాలామందికి ధన్యవాదాలు తెలపాలి. ఇక నేను నా కెరీర్​ను ముగిస్తున్నా. అధికారికంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నా. నా ఈ ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు, సహ ఆటగాళ్లు, జర్నలిస్టులు, అభిమానులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు."

-స్టెయిన్, దక్షిణాఫ్రికా క్రికెటర్

స్టెయిన్​పై ప్రశంసలు

దీంతో స్టెయిన్​ అద్భుత ప్రదర్శన గుర్తుచేసుకుంటా పలువురు దిగ్గజ క్రికెటర్లు సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అతడి భవిష్యత్​ జీవితం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు.

"ముందుకు సాగిపో. నువ్వో నిప్పు. క్రికెట్​లోని ఉత్తమ ఆటగాళ్లలో నువ్వు ఒకరివి."
-సెహ్వాగ్​, టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​.

"అద్భుతమైన కెరీర్​కు అభినందనలు. నువ్వు సాధించిన ఘనతకు గర్వపడాలి. నీ సెకండ్​ ఇన్నింగ్స్​ సాఫీగా కొనసాగాలని కోరుకుంటున్నా."

- వీవీఎస్​ లక్ష్మణ్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

"నా ఫేవరెట్​ ఆల్​టైం, గొప్ప లెజెండ్​ ఆటగాడు"

-హార్దిక్​ పాండ్యా, టీమ్​ఇండియా ఆల్​రౌండర్​

"లెజెండ్​. అన్ని పరిస్థితుల్లోనూ గొప్పగా ఆడే ఫాస్ట్ బౌలర్​​ ఎవరూ లేరు. త్వరలో కలుద్దాం.​"

-ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ కెవిన్​ పీటర్సన్​.

"డేల్​ నీది ఎంతో గొప్ప కెరీర్​. నా ఆఫ్​ స్టంప్స్​ను చాలా సార్లు పాడుచేసినందుకు ధన్యావాదాలు."

- ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకెల్​ వాన్​.

"నీ అధ్భుత కెరీర్​కు అభినందనలు. 20 సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్​ బౌలర్లు అనుసరించాల్సిన ప్రమాణాల్ని సెట్​ చేశావు. రిటైర్మెంట్​ను ఎంజాయ్​ చేయ్​."

-ప్యాట్ ​కమిన్స్​, ఆస్ట్రేలియా బౌలర్​.

"గొప్ప ఆటగాడు, గొప్ప వ్యక్తి. నీతో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నువ్వు ఎప్పటికీ లెజెండ్​.

-ఏబీ డివిలియర్స్​.

"మైదానం లోపల బయట నువ్వు చాలా గొప్ప వ్యక్తివి. కంగ్రాట్స్ మై ఫ్రెండ్​​. మిగతా జీవితాన్ని ఆనందంగా గడుపు."

-మహేలా జయవర్దనె, శ్రీలంక మాజీ కెప్టెన్​.

"గుడ్​ లక్​ బ్రదర్​"

-సురేష్​ రైనా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

స్టెయిన్​ కెరీర్​

కెరీర్​లో మొత్తం 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన స్టెయిన్​ ఎంతో మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 439, వన్డేల్లో 196, టీ20ల్లో 64 వికెట్లు సాధించాడు. గత దశాబ్దంలో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ బౌలర్లలో ఒకడిగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు

2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న స్టెయిన్‌ మొత్తం 95 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మూడు మ్యాచ్‌లాడి సన్‌రైజర్స్‌పై కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ ఆడేందుకు అతడు ఆసక్తి చూపలేదు.

ఇదీ చూడండి: స్టార్ పేసర్ డేల్ స్టెయిన్​ రిటైర్మెంట్

Last Updated : Aug 31, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.