పాకిస్థాన్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టులోని ముగ్గురు క్రికెటర్లు, నలుగురు సిబ్బందికి కరోనా సోకడం వల్ల జట్టులో మార్పులు చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. పద్దెనిమిది మందితో కూడిన కొత్త టీమ్‌ను ప్రకటించింది. ఇందులో తొమ్మిదిమంది కొత్త ఆటగాళ్లను తీసుకుంది. వేలి గాయంతో కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న బెన్ స్టోక్స్ ఇటీవలే జట్టుతో చేరాడు. ఇతడినే ఈ సిరీస్‌కు సారథిగా నియమించింది. దీంతో అతడు కెరీర్లో తొలిసారి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరు జట్లు జులై(8-20) వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి.
జట్టు: బెన్‌స్టోక్స్(కెప్టెన్సీ), జేక్ బాల్, డానీ బ్రిగ్స్, బ్రిడన్ కార్స్, జాక్ క్రాలే, బెన్ డకెట్, లివిస్ గ్రెగరీ, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డాన్ లారెన్స్, సకీబ్ మహ్మూద్, డేవిడ్ మలన్, క్రెగ్ ఓవర్టన్, మాట్ పర్కిన్సన్, డేవిన్ పైన్, ఫిల్ సాల్ట్, జాన్ స్లిమ్ప్సన్, జేమ్స్ విన్స్.
ఇదీ చూడండి: టీ20ల్లో రికార్డు.. 'డబుల్'తో మెరిసిన యువ క్రికెటర్