Cheteshwar Pujara Ranji Trophy : టీమ్ఇండియాకు దురమైన స్టార్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా తాజాగా రంజీ ట్రోఫీలో చెలరేగిపోయాడు. శనివారం ఝార్ఖండ్ - సౌరాష్ట్రకు మధ్య జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టాడు. గ్రూప్–ఎ మ్యాచ్‌లో (157*) అజేయ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ సౌరాష్ట్ర 264 పరుగులు సాధించింది.
మరోవైపు ఓవర్‌నైట్ స్కోరు 108/1తో రెండో రోజు (శనివారం) మ్యాచ్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 406/2 స్కోరు చేసింది. ఇక సౌరాష్ట్ర జట్టులో హార్విక్ దేశాయ్ (85), అర్పిత్ వసవాడ (68), షెల్డన్ జాక్సన్ (54) రాణించారు. ఇక పుజారాకు తోడు ప్రస్తుతం క్రీజులో ప్రేరక్ మన్కడ్ (23*) ఉన్నాడు.
ఇక పుజారాను భారత టెస్టు జట్టు నుంచి తప్పించి ఇప్పటికే చాలా నెలలు గడిచిపోయాయి. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చివరిసారిగా టీమ్ఇండియా తరఫున ఆడిన ఈ స్టార్ ప్లేయర్ ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రాణించలేకపోయాడు. దీంతో వెస్టిండీస్ పర్యటనలో మేనేజ్మెంట్ అతడ్ని పక్కనబెట్టింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో సొంత జట్టు సౌరాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు గత కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంగ్లాండ్ కౌంటీల్లోనూ సెంచరీలు కొడుతూ తన ఫామ్‌ను నిరూపించుకుంటూనే ఉన్నాడు.
ఇప్పుడు భారత్ తదుపరి టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉండగా మరికొద్ది రోజుల్లో ఈ సిరీస్‌కు జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ సెంచరీ చూసైనా పుజారాను జట్టులో తీసుకుంటే బాగున్ను అంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
అయితే పుజారా తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకు 103 మ్యాచ్‌లు ఆడాడు. అందులోని 176 ఇన్నింగ్స్ ల్లో 44.37 సగటుతో 7195 పరుగులు చేశాడు. ఇందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా గత మూడేళ్లలో పుజారా ఆడిన 48 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే శతకం సాధించాడు. ఇందులో ఏకంకా ఐదుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.
దుమ్మురేపిన పుజారా.. దులీప్ ట్రోఫీలో 'సూపర్' సెంచరీ..
Pujara Suspension : వాళ్లు చేసిన పనికి పుజారాపై వేటు.. ఎందుకంటే?