ETV Bharat / sports

జడేజా కోసం ఈ యువ క్రికెటర్ ఏం చేశాడో తెలుసా?

రవీంద్ర జడేజా టీ20 వరల్డ్​ కప్​కు గాయం కారణంగా దూరమయ్యాడు. సెంచరీ లేదా హాఫ్​ సెంచరీ చేసిన తర్వాత జడ్డూకు బ్యాట్​ను కత్తిలా తిప్పడం అలవాటు. ఇప్పుడు అతడు త్వరగా కోలుకోవాలంటూ ఈ యువ క్రికెటర్ అతడిని అనుకరించాడు. దానికి జడేజా ఏమని స్పందించాడంటే..

chetan sakariya and chetan sakaria
chetan sakariya special recovery message to ravindra jadeja
author img

By

Published : Sep 16, 2022, 11:43 AM IST

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే జడేజా వేగంగా కోలుకోవాలంటూ యువ క్రికెటర్‌ చేతన్‌ సకారియా వినూత్న శైలిలో ట్వీట్‌ చేశాడు. జడ్డూ ఏదైనా మ్యాచ్‌లో అర్ధ శతకం, శతకం బాదినప్పుడు తన బ్యాట్‌ను కత్తిలా తిప్పుతాడు. ఈ సిగ్నేచర్‌ స్టైల్‌లోనే సకారియా సైతం ఒంటి చేత్తో బ్యాట్‌ తిప్పుతోన్న ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు.

'జడ్డూ భాయ్‌ను మిస్‌ అవుతున్నట్లయితే.. ఇది చూడండి. జడేజా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని ఈ యంగ్‌ పేసర్‌ రాసుకొచ్చాడు. దీనిపై జడేజా సైతం స్పందించాడు. అతని ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ.. 'హహా.. వెల్‌డన్‌' అంటూ కామెంట్‌ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆసియా కప్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల అనంతరం మోకాలి గాయం కారణంగా జడేజా ఆ టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవల ప్రకటించిన టీ-20 ప్రపంచ కప్ భారత జట్టులోనూ స్థానం కోల్పోయాడు.

ఇవీ చదవండి: బాల్​బాయ్​గా మొదలుపెట్టి.. దిగ్గజ ప్లేయర్​గా ఎదిగి.. ఫెదరర్ విజయ ప్రస్థానం

'ఆస్ట్రేలియా పిచ్‌లపై వాళ్లిద్దరు ఓపెనింగ్‌ చేస్తే బాగుంటుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.